పుట:Garimellavyasalu019809mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధ కవిత్వమిప్పటి కవిత్వ రచనారంగము నుండి సెలవు పుచ్చుకొని పోకతీరదు. అది యెంత సేపటికిని ఒకటే పిండి వంటయై మొగము మొత్తి విసిగించినది. స్వతంత్రమున కందులో అవకాశము తక్కువగుట చేత అది పూర్వపు ప్రబంధముల తాలూకు మరియొక ప్రతి యగునే కాని వేఱొకటి కాజాలదు. కాక పూర్వపు దేవుళ్లందరికిని దేవలోక పురుషులందరికిని మన పూర్వులె పెండ్లిండ్లు చేసి, వారి శృంగారములను వర్ణించినవారు. ఇప్పుడు మన మవరినైన వెదకి తీసుకుని రావలసినంత్ సులభము కాదు. ఇక మనము ప్రబంధములు వ్రాయక ప్రబంధముల సరళిలోనే క్రొత్త కధలు వ్రాయవలెనన్న ప్రబంధములలోని వర్ణనలు అలంకారముల వంటి వానిని మనము తీసివేయుచున్నప్పుడు ప్రబంధములు కాని పద్యములు కాని యేల వ్రాయవలెను. గద్యము చాలదా! యతి ప్రాస వృత్తములలొ మేమీ భావముల నిముడ్చగలమని గొప్ప చూపుటకా! చూడ చూడ ఏకాలములో భావమ్లలో మెరపెడి తళుకులు, స్వగరములగు దీర్ఘమగు తత్వ లేక అధ్యాత్మిక చింతనలు, ప్రకృతి పరవశత్వములు మొదలగు వానికి తప్ప కధలకు కవిత్వమునందు తావు లెదు. అయినను ప్రబంధ కవిత్వము నిప్పటికైనను మేము నిరసింప బూనము. ప్రాత వర్ణనలు కల్పనలు దొంగిలించి, వేరొక రీతి పదములతో తిరిగి యొప్ప చెప్పకుండా, వీలయినన్ని స్వాతంత్యములు తీసుకొని తమ కవి యనుబవములను కధా భాగమ్లలో జొప్పించి వ్రాయగల వారికి మాయభిననందు లీసున్నాము. అంతవరకున్ను అన తెనుగు కవిత్వమునకు ఖండ కావ్యములును భావకవిత్వములును కాక గత్యంతరము లేదు. అయినను భావకవిత్వరంగమిప్పుడు చాలా అరాచకముగా నున్నది. దానికొక సిద్ధాంత మంటూ లేదు. అర్ధం తెలియ నీయకపోవుట, అలంకార మంతంతలోనే మార్పులు, భావమును ప్రస్పుటము చేయకుండుట, స్వాంతమునందు నిమగ్నం చేసి సంగీతపు కళలు విసరి విసరిపాడుచు ఆనందించుట యివి యెల్లయు భావ కతిత్వ లక్షణములుగా పెక్కురు భావించి, కోరి యెట్లు వాని నొనరించుచున్నారు. నిజముగా భావమున కెట్టి నిబంధనలు లెవో భావకవిత్వమునకు గాని ఖండ కావ్యములకు గాని వ్రాసి పెట్టి నిర్ణయించగల నిమంధనల్ లేవనియు, ఉండజాలవనియు మేమును నొప్పుకొందుము. కని సహజత్వమును కూడ, ఒక యుండకూడని లక్షణ