పుట:Garimellavyasalu019809mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ విధముగా మానవదస్యము అంతరించుననియే తంతుము కాని అధునాతన వ్యాపార, ధనరాధనా తత్వజన్యమగు ఈ దాస్యమునకు మూలకారణమైన ప్రధాన దాస్యము దెసకే మన మిప్పుడు మన దృష్టి మరల్చవలసి యున్నది. ఈ విధమైన దాస్యము తలయెత్తుటకు కారనము, వివిధ పాశ్చాత్యదేశములలోని ధనారాధనా ధనదాస్యత్వమే మూల కారణమని మనము పైని చూచితిమి. వారు ధనదాస్యమును ముందు ముందుగా తొలగించుకోనిదే మానవజాతిని ఈ నిజమైన దాస్యము నుంచి విముక్తుల చేయజాలరు. వారు చేసే పరోపకార, మానవధర్మ సూత్ర ప్రసంగాలన్నీ వట్టి పొల్లులే కాని ఈషణ్మాత్ర ఫలం నైనను నీయజాలవు.

   నేటి ప్రపంచరాజ్యములును తన్నాయకులును డిమోక్రసీలు, శాసనసభలు, చర్చలు తీర్మానములు, వోటులు మొదలగు యెన్ని ఆడంబరములు పైపైకి చేస్తున్నా ఈ ధనదాస్యము నుండి విముక్తుల మవుదామనే సత్సంకల్పము వారిలో లవలేశమును లేదు. ప్రతి నాగరిక దేశమును నేడు తనసేవలను పెంచుచున్నదంటే, ఆటంబాంబులను సృష్టించి చున్నదంటే, ప్రపంచ సౌఖ్యార్ధము కాని వాణిజ్య పంటల సరకుల ఉత్పత్తి నెక్కువ చేయుచున్నదంటే, జనావశ్యకత కార్యములను విసర్జించుచున్నదంటే, వలస రాజ్యములను విడువనొల్లక స్వారీ చేయగోరుచున్నవంటే, తమ మీదికి మాత్రము దురాక్రమణలకు సంకోచింపకున్నదంటే, దీని కంతకును కారణ మా మహనీయుల దనదాస్య వివర్ధనాభిలషయే కాని దానిని త్యజింపగోరు సుహృద్భావము కాదు.
 నేడు దనదాసుడు కాని వ్యక్తియే భూలోకములో లేడ అనిపించుచున్నది. సాధారణ కార్మికుడు మొదలు కోటీశ్వరుడు వరకు సర్వులను యధాశక్తి ధనదాస్య పరాయణత్వముతో వర్తిస్తున్నారు. అదృష్టవంతులు పెద్ద గొప్ప ధనదాసులగుచున్నారు. అదృష్ణహీనులు చిన్న అంతస్థులలో కొట్టుకొంటూ ఈడుపోత పడుచున్నారు కాని పోటీ చక్రములో వీరందరు సమానముగా కొట్టుకుంటున్నవారే.
   అయినా దిగువ అంతస్థుల వారిని మనమంతగా నిందించిన లాభము లేదు. బలవంతులతో బలహీనులు సహాయ నిరాకరణం చేస్తే బలవంతుల
గరిమెళ్ళ వ్యాసాలు