చేయించుకోవడం పరిపాట అయినది. లాభసాటి ఉత్పత్తి వ్యాపార పద్దతులు ప్రారంభంకాగానే ఈ వ్యాపారము ప్రభువుల రాజుల చేతులలో నుండి జారి దారిపోయే వర్తకమ్మన్యుల చేతులలోకి వచ్చి, వారు వివిధ దేశములలో తిరిగి ప్రజలనాసబెట్టి లోగొని అన్య దేశముల సాహుకార్లకు అమ్మడం వ్యాపారం పెరిగినది.
అమెరికా, ఆఫ్రికా, మొదలైన దేశాలు మధ్యయుగములో, పెద్ద వ్యావసాయక పారిశ్రామిక శ్వేత రాజ్యములుగా వర్ధిల్లడానికి ఈ బానిస వ్యాపారమెంతో ఉపకరించినది.
అయితే వ్యాపార దేశముల మధ్య పోటీ వల్లనైతేనేమి మానవ స్వాతంత్ర్య భావము యెడల గౌరవము వల్లనైతేనేమి మానవుని మానవుడు తన స్వంత లాభం కొరకు కొనుక్కోవడం అమ్ముకోవడం ఒక శాసనబద్ధ నేరముగా పరిగణించబడినది. దానికి స్వస్తి కూడా చెప్పబడినది. కాని దక్షిణాఫ్రికా మొదలైన దేశముల్లో నిన్నటి వరకు అమలులో నుండిన ఇండెంచరుడు లేబరు పద్ధతి తత్పూర్వపు బానిసీడు పద్ధతికి అట్టే వ్యతిరేకము కానిదనీ, ఎన్నో దీన సంఘముల తరపున మహాత్మాగాంధీ వంటి మహనీయులు పోరాడిన సమరముల వల్ల అది కూడా మాయమైనదని, మనము భావించవచ్చును.
అయినా, పూర్వపు శాసనాలే మారినవి కాని అచ్చటి కార్మిక వర్గముల కష్టములు గట్టెక్కలేదు. ఆ దేశాలలో ఇంకా శ్వేత జాతులు కొక శాసనం, నల్ల నీగ్రో మొదలగు జాతుల కొక శాసనం అమలు జరుగుచునేయున్నది. శ్వేతా శ్వేత జాతులు కలిసి మెలగరాదు. పెళ్ళిళ్ళు చేసుకోరాదు. రైళ్ళలో, స్టీమర్లలో, బస్సులలో, వారికి వేరు వేరు కంపార్టుమెంటులు. వారి పేటలు వేరు, వీరి పేటలు వేరు, వీరికి చదువు సంధ్యలు, ఆటపాటలు, వోటు హక్కులు, పెద్ద ఉద్యోగములు, వాణిజ్య వ్యాపారాది సౌకర్యములు కూడదు.
ఇట్టి దురాచారములు అమెరికాలోనే ఇంకా అమలు జరుగుచున్నవంటే, తక్కిన వలస దేశాల మాట వేరే చెప్పనేల? వీని నణగద్రొక్కుటకు ట్రూమన్ కంకణం కట్టుకొన్నాడంటే, మనము ప్రపంచ సభ్యతా స్థాయిలో ఒక మెట్టు పై కెగురుగలిగామని సంతోషింపవచ్చును.
గరిమెళ్ళ వ్యాసాలు
159