పుట:Garimellavyasalu019809mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బలముదుగుతుందను గాంధీ సూత్రం కూడా యిక్కడ సరిపడదు. మొట్టమొదటలో అట్టి సుదృడ సంకల్ప ముదయించినట్లు కనపడునే కాని ఉదయించదు. ఉదయించినా సాగదు.

    ఇది మానవ సంఘ శరీరానికంతటికీ పట్టుకొన్న దీర్ఘ వ్యాది దీనికి తరుణౌషధము తప్ప సామాన్యపు మందులు చాలవు.
  పూర్వ్ం ఏ సంస్కరనమైనా ప్రజలలో ఉదయించి ప్రభువులకు నచ్చి శాసన రూపముయేది. నేడు ప్రభువులకే ఈ సంకటం పట్టుకొని ప్రజలలోకి వ్యాపించింది, గనుక ప్రభుత్వములనే ముందు ముందుగా యీ సంకటము మంచి విముక్తము చేయాలి. దానిని సాధించగలవారు నేటి నాగరికతలో నవసి కుళ్లుచున్న జనులును జన నాయకులును కారు. ఉత్తమ సంకల్ప ప్రదీపితులగు నేతలే, రష్యాలో లెనిన్ కొంతవ్రకు ఆ సంకల్పము సాధించినాడు. కాని కమ్యూనిజము ఇంకా ప్రయత్న మార్గము లోనే వున్నది. దాని సత్సంకల్పమునకే కళంకమును కలిగించుటకై పాశ్చాత్య డిమోక్రసీలు కుతంత్రమ్లు పన్నుచున్నది. ప్రచార సంస్థలన్నియు వారి చెపుచేతలలో వుండి వారినే బలపరచుచున్నవి. 
  ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి ఉదయించినది కాని అది సార్ధక సంకల్పయగుట దుస్తరము అదినిజముగా సఫలము గావలెనంటే, వలస రాజ్యములు గల దేశములను మున్ముందుగా సభ్యత్వము నుంచి బహిష్కరించవలెను. బ్రిటను ఫ్రాన్సు హలండు పోర్చుగలు మొట్ట మొదట తమ వలస ప్రాంతముల నుంచి తొలగవలెను.
     ఏదేశాని కాదేశం  సంపూర్ణంగా ఆ రీతిని స్వతంత్రమైన తరువాత, సభ్యదేశాలన్నీ ముందు ముందు ఆర్ధిక సంస్కరణకు పూసుకునేటట్టు ఆ దేశము పంపవలెను. ప్రస్తుతం వివిధ దేశాలను పాలిస్తున్నవారు నిష్కళంక దేశాభిమానులు కారు. ధనవ్యామోహ పీడితులగు వారి దాసులు ధనాడ్యులు పన్ను చెల్లించకపోతే ప్రభుత్వములు నడువవు గనుక వారి కూడిగము చేయవలెననే దుర్నీతి నేటి ప్రపంచదేశముల నావరిచి యున్నది. కనుక, డెమోక్రసీ గిమోక్రసీ అనే కుటిల తంత్రములు ప్రతి దేశమును కట్టిపెట్టి, నిస్వార్ధ ప్రజల ప్రభుత్వము లేర్పడవలెను.
గరిమెళ్ళ వ్యాసాలు