పుట:Garimellavyasalu019809mbp.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేడు ప్రపంచపు బ్యాంకులలో వున్నది ధనమే కాదు. వెండి బంగారులన్నీ యే స్వల్పమాత్రదేశములలోనో పేరు కొన్నది. అవి కదలవ్చు కదలి వచ్చినా వాటికి పరువు ప్రతిష్టలు లేవు. అవి కదలకుండానే నేటి వ్యాపార మంతా ఏదోకుతంత్రాలల మీద నడుస్తున్నది. సుతంత్రాల మీద కూడా అట్లే నడువగలదు. ఇన్ప్లేషను రూపకమైన, ఈ ధనం నశిస్తే ఈ దురాశ, అవినీతియే నశించును. కాని వ్యాపారము స్తంభింపదు. ధనాడ్యుల నణిచి వేయగల దృఢ పాలనము మాత్రమే యీ పనిని సాధించ గలదు.

   అట్టి దృఢపాలనముల నేర్పరచుట ఇప్పుడు కష్టము కాదు. కోటికి పడగలెత్తిన హైదరాబదు నవాబంతటి వానిని బారత మిలిటరీ ప్రబుత్వము నిమిషములో నామాత్రవశిష్టుని చేసినది. అంత మాత్రాన రాజ్యం నశించలేదు  సరే కదా, ప్రజలు సుఖిస్తున్నారు. అట్లే భారతప్రభుత్వం ఈ దేశపు బ్యాంకులపై దాడిచేసి ఉబ్బసమును అణచినచో ఆకాశం నేలమీద పడిపోదు. వ్యాపారమే సవ్యమార్గమున నడచి, ధనము సమవిభజనమై ధరలు తగ్గి కరువు కాటకములు తగ్గి, శాంతి సంతోషములు వర్ధిల్లును.
     ఐక్యరాజ్యసమితిలో ఇట్టి భారతదేశ మొక్కటి సభ్యయై యున్నను తక్కిన దేశములనేక మార్గదర్శియై ప్రపంచ శాంతికి సరియైన రాచబాట నేర్పాటు చేయగలదు. నెహ్రూ పటేళ్లు సైనిక బలము నుపయోగించియైనా ఈ దేశము నీ రీతిగా దిద్ది సార్ధక జన్ములు కాగలరా? చూడవలసియున్నది.
    వారీ ప్రధాన కార్యక్రమములను మాని, కామనువెల్తులో చేరడమా, మానడమా, ప్రజాశయమగు భాషాప్రయుక్త్ రాష్ట్ర నిర్మాణ్ మిప్పుడా, ఇంకొకప్పుడా, సంస్థానాలను తమ కనుకూల మగునట్లా లేక ప్రజారంజక మగునట్లా భారతయూనిననులో లీనం చెయ్యడం, నిష్కళంక దేశాభిమానులను దండించడమా, క్యాపిటలిస్టుల బలపరచడమా, కార్మికులను అణగద్రొక్కుడం మొదలైన క్షుద్ర సమస్యలపై తమ దృష్టిని కేంద్రీకతించినచో, భారత ప్రభుత్వ చరిత్ర మరింత అద్వాన్నమై సంస్కరణము మానవాతీతమై వారికి వచ్చిన పేరు ప్రతిష్టలే పేపర్లలో నిలుచును గాని దేశస్థితి అగమ్యగోచరమై స్వతంత్ర భారత స్వప్నము క్షణములో కరిగిపోవును.
ఢంకా, 1948 నవంబరు
గరిమెళ్ళ వ్యాసాలు