పుట:Garimellavyasalu019809mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేయించు కోవడం పరిపాట అయినది. లాభసాటి ఉత్పత్తి వ్యాపార పద్దతులుప్రారంభం కాగానే ఈ వ్యాపారము ప్రభువుల రాజుల చేతులలో నుండి జారిపోయే వర్తకమ్మన్యుల చేతులలోకి వచ్చి, వారు వివిధ దేశములలో తిరిగి ప్రజలనాసబెట్టి లోగొని అన్య దేశముల సాహుకార్లకు అమ్మడం వ్యాపారం పెరిగినది.

 అమెరికా, ఆఫ్రికా, మొదలైన దేశాలు మధ్యయుగములో, పెద్ద వ్యావసాయిక పారిశ్రామిక శ్వేత రాజ్యములుగా  వర్ధిల్లడానికి ఈ బానిస వ్యాపారమెంతో ఉపకరించినది.
  అయితే వ్యాపార దేశముల మధ్య పోటీ వల్లనైతేనేమి మానవుని మానవుడు తన స్వంత లాభం కొరకు కొనుక్కోవడం అమ్ముకోవడం ఒక శాసనబద్ధ నేరముగా పరిగణీంచబడినది. దానికి స్వస్తి కూడా చెప్పబడినది. కాని దక్షిణాఫ్రికా మొదలైన దేశముల్లో నిన్నటి వరకు అమలులో నుండిన ఇండెంచరుడు లేబరు పద్ధతి తర్పూర్వపు బానిసీడు పద్దతికి అట్టే వ్యతిరేకముకానిదనీ, ఎన్నో దీన సంఘముల తరపున మహాత్మాగాందీ వంటి మహనీయులు పోరాడిన సమరముల వల్ల అది కూడా మాయమైనదని, మనము భావించవచ్చును.
  అయినా, పూర్వపు శాసనాలే మారినవి అచ్చటి కార్మిక వర్గముల కష్టంజులు గట్టేక్కలేదు. ఆ దేశాలలో ఇంకా శ్వేతజాతుల  కొక శాసనం, నల్లనీగ్రో మొదలగు జాతులకొక శాసనం అమలు జరుగుచునేయున్నది. శ్వేతాశ్వేత జాతులు కలిసి మెలగరాదు. పెళ్ళిళ్లు చేసుకోరాదు. రైళ్ళలో, స్టీమర్లలో,బస్సులలో, వారికి వేరు వేరు కంపార్టుమెంటులు. వారి పేటలు వేరు, వీరి పేటలు వేరు, వీరికి చదువు సంధ్యలు, ఆటపాటలు, వోటుహక్కులు, పెద్ద ఉద్యోగములు, వాణిజ్య వ్యాపారాది సౌకర్యములు కూడదు.
     ఇట్టి దురాచారములు అమెరికాలోనే ఇంకా అమలు జరుగుచున్నవంటే, తక్కిన వలస దేశాల మాట వేరే చెప్పనేల? వీని నణగద్రొక్కుటకు ట్రూమన్ కంకణం కట్టుకొన్నాడంటే, మనము ప్రపంచ సభ్యతా స్థాయిలోఒక మెట్టు పై కెగురుగలిగామని సంతోషింపవచ్చును.
గరిమెళ్ళ వ్యాసాలు