పుట:Garimellavyasalu019809mbp.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"దాసీ భూత సంస్త దేవ వనితాం" అని వర్ణించారంటే, దేవ వనిత లంత అస్వాధీనలని కఠిన పరిపాలనా బాధితులని అర్ధము కారు. అయితే భక్తి గౌరవచూచకం కావాలి, లేదా కేవలం అలంకారా తిశెయోక్తి కావాలి. మహాభక్తులు పరమయోగులు కూడ పరతత్వ దాస్య బిరుదములను సగర్వముగ వినియోగించుకొనేవారంటే, అది వారి వినమ్రతను చూచించును. కాని పరమేశ్వరుని దౌర్జన్య చొహ్నము కాదు.

 అయినా భారతదేశములోల్ని వర్ణశ్రమాది హెచ్చు తగ్గు భేదములను ఒక వర్గము ఇంకొక వర్గముపై స్వారీ చేయుటకై నిర్ణయించబడిన తంత్రముగా పరిగణించి, ఏదోఒక రూపమున బానిసత్వమనేది మన దేశములో కూడా కలదని నిరూపించుట పాశ్చాత్య చారిత్రక పరిశోధకులు సంకుచితాభిప్రాయమై వెలిసినది. ఇంకను వెలయుచున్నది.

కాని ఈవర్ణాశ్రమ దర్మములు మానవుల్ అదికార్ తారతమ్యములను బట్టి, వృత్తి నైపుణ్య విచక్షణముల్ను బట్టి నిరంతరాభివృద్దికిని తన్మూలమున మోక్షసిద్దికిని యేర్పాటు చేయబడిన సాధనమాత్రము అని యెట్టి వివేకికైనను గోచరింపక మానదు. అయినా కొందరు ఏక ప్రపంచపద్దతి వారులు ఈ విషయమున మనపుణ్యభూమి యగు భారతదేశము కూడా తదితర దేశముల తెగకే చెందినదను వాదనను పెట్టుకొని, దీనికి పరదేశములలోని బానిసత్వలక్షణముతొ ముడిపెడితే వారితో వాదించిన లాభము లేదు. వారి అభిప్రాయములు మారవు.

     ప్రపంచములో ఎప్పుడో ఒకప్పుడు బానిస తత్వమును శ్రీమంతులు అనాధలపై చలాయించుచుండి రనుట నిర్విదాంశము. పూడలుయుగములొ అది ఒక మోస్తరు పాలక వర్గముల దర్జాగా పరిగణింపబడెను. వ్యూడ్లు యుగము పోయి ధనయుగము రాగానే ఆబానిసల్కు ప్రభు సేవక దర్జాకూడా పోయి కెవలం పనిముట్ల పరిస్థితి యేర్పడినది. పెక్కుమంది బానిసలున్నవారు ఎక్కువ సరుకు నుత్పత్తి చేసి వ్యాపారం ద్వారా ఎక్కువ లాభములను చేదుకొనుట కుపాయమైనది. అప్పటి నుంచి యీపనిముట్లు  కావలసి వచ్చినప్పుడల్లా పరదేశములపై పడి అచ్చటి ప్రజల జయించి, వారిని తమ ఇష్టం వచ్చిన చోట్లకు  తీసుకొనిపోయి బానిస చాకిరీ
గరిమెళ్ళ వ్యాసాలు