పుట:Garimellavyasalu019809mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలమత్యల్పము. రినైజాన్సుకు ముందు ఫ్రెంచి యింగ్లీషే కాని ఆధునిక యింగ్లీషే లేదు. అక్కడితో పండిత యుగము ప్రారంభమగును. కాని పాండిత్యపరిశ్రమ యుగ భాగ్యమును ఆ దేశమెంతో కాలమనుభవించలేదు. దాని యడుగుల జాడలనే వెంబడించుకొని యీ నవీన వార్తా పత్రికాయుగము వచ్చినది. ఆ యుగము నిలచిన యీషత్కా లములో మిల్టను విజృంభించెను. అంతతో సరి. తరువాతను గబ గబ గ్రంధములు వాయడము, వేగము వేగము అచ్చాఫీసు కివ్వదము, తడి తది ఫ్రూఉలను దిద్దడము. షిల్లింగు పెట్టి వీధి పోయేవాళ్ళు కొనుక్కొని చదువుకొని బాగున్నదనో ఓగున్నదనో విమర్శించడము యిట్టి నవీన యుగము, ప్రారంబించినది.లందను నిండ్సా సంచికలు వెలసినవి ఎవరి యిష్టము వచిఅంట్లు వారు వ్రాయదొడగిని, జాన్సను, పోపు మొదలైన పండిత శ్రేష్మలిది నచ్చక దూషించుచు భూషించుచు సాహిత్య సామ్రాజ్య చక్రవర్తులై యేలుచుండుటలు, వెంటనే క్రొత్తక్రొత్తసూత్రములు లేచుటలు, ఒకరి మీద ఒకదు తిరుగుబడుటలు, ఈ గందరగోళము లోనికి దిగినది. తిరుపతి కవీశ్వరుల నాటికే మనదేశములో వ్యర్ధ పద్య ప్రచురణ మెక్కువయై నోటిలోనుంచి వచ్చెడి తుంపరులు కూడ అచ్చుపడుచున్నవేయని విచారింప వలసి వచ్చినది. అట్టిచో లండను నగరములో నిట్టి పత్రికలలో నెన్ని పద్యములు వ్రాసిన నైనను కొన్ని మంచివి బాగుగా నుండుటయు, కొందరు మంఇ కవీశ్వరులు కూడ చిన్న చిన్న పద్యములే కాని పెద్దవి వ్రాయలెకుండుటయు సహజము విద్యాదికులకు పెద్ద కావ్యములను వ్రాసి మిల్టను వలె కీర్తి పొందుదమని అప్పుడప్పుడు కోరిన వొడము చుండెడిది. కాని వాటితో తులతూగ లేక విరమించు కొనువారు కొందరును, కొందరు పెద్దకావ్యములు వ్రాసినను అవి అతికిన చితుకుల వలె నుండటయే కాని గంభీర కావ్యమునకు గల యేకత్వ మందులో లేకుడుటయు తటస్థించెను. ఇట్లు తాత్కాలిమముగా వ్రాసెడి చిన్ని చిన్ని పద్యములు కాక, తీరుబాటు సమయములలో ఆలోచించి కవితావేశములో వ్రాసెడి దీర్ఘ పద్యములు కూడా ప్రత్యేకమైన గ్రంధముకావలసినంత పెద్దరి కాక Major poems అని మాత్రము పిలువబడుచుండెను. Major poems ను ఖండ కావ్యము లన్నచో Major poems ను అఖండ