పుట:Garimellavyasalu019809mbp.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మును నాటీకి నవీనయుగ సంబంధమైన యొక విశిష్టత్వము నిచ్చుచుండుట చేత్య నవి నవీరన్ నాటక రంగముల మీదను కవితాపరాయణం విలోకనము నందును నమలులో నున్నవి. ఇతర శతావధానులును మన్నారు పండిత కవీంద్రులును నున్నారు. కాని వారిలో నున్న ప్రాచీన నవీనపు తళ్కులెల్ల వీరిలో మూర్తీభవించి యుండుట గూర్చి కూడ యీ సూత్రముల ప్రకారము ప్రత్యేక ప్రశంసలకు పాలు సేయుచు విమర్శలు వ్రాయవలసి యున్నది.

     ఇట్టి ఖండ కావ్యములకును భావ కవిత్వములకును దగ్గర సంబందమున్నది. ఇట్టి సమయమున ఆంధ్రయువకులకు ఆంగ్ల కవీశ్వరులతోడి పరిచయముకలిగినది.  ఆంగ్ల భాషలో మన భాషలో వెలె ప్రబంధముల వంటి పెద్ద పూర్ణ పద్యకావ్యములు లేవు. కావ్యమిహమున కీర్తిని పరమున ముక్తిని నొసగు మన మత విశ్వాసమగుట చేత దాని యందు నిష్ఠాబద్దమగు నొక శ్రద్ధ తీసుకొని చక్కని చిత్రకళగా చేయవలసి వచినది. దానిని గూర్చి కొన్ని నిబందములు, నిషిద్ధములు, అలంకారములు, క్రమములు మొదలగు నొక శ్రద్ధ తీసుకొని చక్కని చిత్రకళగా చేయవలసి వచ్చినది.  దానిని గూర్చి కొన్ని నిబందములు, నిషిద్ధములు, అలంకారములు, క్రమములు మొదలగునవి యేర్పడి సంస్కృత కాలము నుండియు సాంఘికాచారముల వలె అనుసరించుబడుచు వచ్చినవి.  వెఱ్ఱి, మొఱ్ఱి పద్యములెన్ని వ్రాసినను చాటుధారలెన్ని కురిపించినను వారు దాని నొక ప్రశంసనీయతకు కారణముగా గైకొనలేదు. పాశ్చాత్యదేశములలో నట్లు కాక కవిత్వము మనస్సు నాహ్లాదింపె చేసుకొనుట కొక చిత్ర విశేషమగుట చేత యెవరి యిష్టము వచ్చిన యంశమును వారు, యెంత వరకైతే అంతవరకు, యిష్టము వచ్చిన రీతిని రచించి లోకుల యెదుట పెట్టి వైచి ఆనందించుకొనుచుంటయె వారి యాశయము.  ఇట్టి వానిలో యశ: ప్రేరితములగు కావ్యములు దీర్ఘములై కమబద్ధములై కళాసహితములై "పేరడైజు లాస్టూ వలె నలరారుచున్నవి. తక్కినవి గాలిపటములవలె కవితాప్రపంచములో కొట్టుకొనుచున్నవి.  మతనిష్ఠతోను పాండిత్య ప్రదర్శనాహంకారముతొను యశోవాంచతోను వ్రాయబడినప్పుడు తప్ప, దీర్ఘకావ్యములు కాని, కావ్యాలంకారములు కాని బయలుదేరవు.  ఆంగ్ల సాహిత్య చరిత్రములో నట్టి సంచలనములనే ప్రేరితమైన