పుట:Garimellavyasalu019809mbp.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కెవరికినీ లైసెన్సు లివ్వడం మానేసి ఋజువర్తన గల కొత్త వారికి లైసెన్సులియ్యాలి. అట్టి వారెవ్వరూ దొరక్కపోతే ప్రభుత్వచర్యలు మానుకొని ప్రజలకు వర్తకం తామే సాగించాలి.

    అయితే ప్రభుత్వాలే వర్తకానికి పూనుకుంటే వర్తకులను కరచిన పామే వారిని కూడా కరుస్తుందేమో! వర్తకుల మీద చర్య తీసికొనుటకై (తీసుకున్నా తీసుకోకపోయినా) ప్రభుత్వమొకటి వేరే యేదో ఉన్నదన్న భరోసాయైనా ఉంటుంది. ప్రభుత్వమే ఇటువంతి వర్తకానికి దిగితే ఆకాస్త భరోస కూడా పోతుంది.
  మహా నిస్వార్ధియైన త్యాగపురుడు రజకీయ పరిజ్ఞాన వేత్త కఠిన చర్యా సమర్ధుడగు వ్యక్తి యెకడుద్భవించి కార్యక్రమమునకు పూనుకుంటే ఈ అరాచకమణగదు. అతడే మనపాటి కల్పకమై రక్షకుడై అలరారుతాడు. ప్రస్తుతం నడుస్తున్న ప్రజా పరిపాలనా విధానము పై రీతిగా బూటకమై యున్నది కనుక అంతటె అవతార మూర్తి ఇప్పుడు కనిపించక పోతే ఆశ్చర్యము కాని, అవతరించి ఈ తుచ్చ విదానము నంతటిని తుత్తునియలు చేసినచో ఆశ్చర్యమేమీ లేదు. ఈ అజ్ఞాన రంగమున అది యొక్కటియే భిక్షాదాన విధనము
ఆనందవాణి, 1948 ఆగస్టు 15,