పుట:Garimellavyasalu019809mbp.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వపు బానిసత్వం

నేటి ధన బానిసత్వం

  ప్రపంచంలో ఒకప్పుడు బానిసలంటూ ఒక రకం మనుష్యులుండే వారట. పురాణయుగంలో వారిని గురించి మన మట్టే వినకున్నా చారిత్రక యుగంలో వారు పడిన బాధలను గురించి చదివినాము. ముఖ్యముగా రోమను సామ్రాజ్యదినములలో రోమను నాయకులు రాజులు తాము జయించిన దేశాలలోని, ప్రజలలో కొందరిని మృగాల లాగా చూచి, తమ కనూలు వినోదాలు తీర్చుకొనేవారు. తప్పేల ముంతలను లాగేవారిని అమ్మడం కొనుక్కోవడం అసంఖ్యాకులగు వారిని కట్నాలు కానుకల క్రింద చదివించడం జరిగేది.
    సాధారణ బానిసలకు అది అలవాటు పరిపాటి అయినది కనుక వారందుకు ఏడ్వడం కూడా జరిగేది కాదు. కొందరు తమ ప్రభువుల వినోదాలతో పాటు తమ వినోదాలు కూడా తీరినట్లే భావించి అందుకు ఉపకరించేవారు. కొందరు ఆ భాధలు తప్పు కొనుటకై యత్నించి పట్టుబడి మరిన్ని పీడల కెరయగుచుండుటయు సంబవించేది.
  అటు వరువాత మధ్య ప్రాచ్యంలో అరేబియన్ నైట్సు మొదలగు కధలలో వానిని గురించి మనము చదువుటయే కాక, అచ్చటి శ్రీమంతులు కూడా నిరంతర నిస్సహాయ దుర్భలురను కొల్లగొని పురుషులను కొజ్జాలను చేసి తమ అంత:పుర జనానా స్త్రీల మానరక్షణకై కాపలా పెట్టుకొనేవారు. సాధారణముగా సుఖవాసి వృత్తులను తామాచరించుచు మృగసాద్యమగు కఠిన కార్యముల్ భారమును వారిమీద పెట్టి ఆ లాభములతో తాము విఱ్ఱవీగేవారు.
    భారతదేశములొ అట్టి దాస్యమున్నటుల పురాణం వల్ల గాని చరిత్రేలవల్ల కాని కనిపించదు. దాస్య, దాన దాసీజన శబ్దములు గొచరించుచుండినను అవి తత్సాత్రుల అస్వాధీనమును బట్టి కాక ప్రభుభక్తి పరాయణత్వ సూచకములుగానే ఉండినట్లు తొచుచున్నది పరదేవత యగు మహాలక్సిమిని
   గరిమెళ్ళ వ్యాసాలు