పుట:Garimellavyasalu019809mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొనుక్కోలేని సరుకును తూము కాలువలలొ పోసినా వారికి కలిగే కుందకమేమీ లేదు.

 వాణిజ్య విదానములొ ఇంతకంటె అరాచకము లేదు ఈ అరాచకము వల్లనే వర్తకులు బాగుపడుతూ, ప్రభుత్వానికి పెద్ద పన్నులు చెల్లించి అది ర్చులు భరించి సాగుటకు సాయపడు తున్నారు. కనుక, ప్రభుత్వములు రహస్యముగ వారినే బలపరచు చున్నవి. ఇట్లు వర్తకులును ప్రభుత్వములును కలిసి ప్రజల ప్రాణమానములు హరించుచున్నారు. ప్రభుత్వములు వర్తకులు చేస్తున్న ఈ అరాచకము నింత  సహిస్తూ కూడా, ప్రజలిందులకు విరోధముగా ఏమాత్రమాందోళనము ఛేసినను చెవిని పెట్టకుండు టయే  కాక, వారినే అరాచకులుగా భావించి కేసులు పెట్టి జెయిలు శిక్షలు విధించుచున్నారు.
   ఇదంతా ప్రభుత్వముల లొపముకాక వేరుకాదనుట స్పష్టము ప్రజలలో అరాచకమనుకొనేదానిని అనచుటకు ఇన్ని ఆర్డినెన్సులు ప్యాసు చేస్తున్న ప్యాసు చేయజాలరా? ఆ అరాచకమణగితే ఈ అరాచకము సమ్మెలు మొదలైన వేవీ కలికానికైనా కానరాకుండ హరించేవే!

రేషనింగు కంట్రోలు ఉన్న రోజులలోనే కాస్త నయముగా వుండేది. చాలీచాలని తిండి బట్టయైనను అందరికీ వుండేది. గాంధీ మహాత్ముని ఆందోళన వలన కంట్రోళ్లుతీసినప్పటినుంచి ఖరీదులు నాలుగు రెట్లు పెరిగినవి. వర్తకులలో ఏదో నీతి వున్నదనీ, దానినిబట్టి ప్రజాశ్రేయస్కరమే తమ కనుకూలమగు లాభములు కలిగేటట్లు వర్తకులు అమ్మగడంగుదురనియు గాంధీజీ భ్రమపడినాడు. ఆభ్రమ విచ్చిన్నం కాక ముందే ఆయన మరణించాడు.

   తిరిగి కంట్రోళ్ళు పెట్టడమా మానడమా అనే సమస్యలో ప్రభుత్వములు పడినవి. కంట్రోళ్ళు రేషనులు పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రజలకు నష్టమే. రేషనుంటే దొంగబజారులో కొనుక్కుని దొరికి జెయిళ్ళ పాలు కావాలి లెకుంటే బహిరంగ్ బజారు ఖరీదులు చెల్లించలేక జనులుమాడాలి.
   ఇందుకై ప్రభుత్వములు వర్తకులపై చర్యలకు పూనుకోవాలి ప్రాతవారి
 గరిమెళ్ళ వ్యాసాలు