పుట:Garimellavyasalu019809mbp.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తగ్గినా విదేశముల నుంచి తెప్పించి భర్తీ ఛెయుచున్నారు. అన్నీ వుండి ఐదవతనము లేదన్నట్లు ఇంత సరుకూ వుండి యీ కాటక మెందుకు కలగాలి?

  ఇది సరుకు లేనందువల్ల కలిగిన కాటకము కాదు. వర్తకులు పేరాస మరగి, పెద్ద ఖరీదు లిచ్చిన వారికి తప్ప సరుకును అమ్మక పోవుచున్నందువల్ల కలుగుచున్న ముప్పు అంత పెద్ద ఖరీదు లిచ్చి జనులు కొనుక్కోజాలకున్నారు.
  పూర్వము చిన్న ఖరీదులున్న రొజులలో సరుకంతా విక్రయము కాకపోతే వర్తకులకు నష్టము వచ్చేది. అట్టి నష్టమును భరింప జాలక స్వల్పలాభము లతో తృప్రిపడేవారు. సరుకును చౌకగా అమ్మి విడుదలచేసుకొనెవారు. అ వచ్చిన డబ్బుతో తిరిగి సరుకు కొని అమ్ముచుండుట వల్ల సరుకు విరివిగా చేతులు మారుతూ అందరికి తృప్తినిగూర్చేది.
   కాని ఇప్పుడల్లాగా గాదు. సరుకు ఎంత విస్తారముగ ఉన్నా పెద్ద ఖరీదు లీయగల వారికి తృప్తిగా యెక్కీ దొక్కి దొరకడం, ఇవ్వలేనివారికి కడుపుమాడడం తటస్థించుచున్నది. వర్తకులు లాభము మాటా, వారు కోరిన పెద్దఖరీదులీయగల వారు ఏ పదిమంది ఉన్నా వారి చేయి వదలిన సొమ్ము....... పెద్దలాభము కూడా వస్తున్నది. తక్కువ సరుకు విడుదల కోసం ఆసమయమున నాకు ఖరీదులు తగ్గిస్తే మొదటి ఖరీదులు చెల్లించే వరివల్ల కలిగే లాభాలు వారికి సున్నచుట్టును. వారు కోరిన పెద్దలాభాలు వారికి వచ్చిన తరువాత, తక్కిన సరుకు చెల్లకపోయినా వారికి నష్టము లేకపోయిన తరువాత, జనులు ఆకలి అవసరములు తీరుటకొర్కు వారేల ఖరీదులు తగ్గిస్తారు?
 ఇంతకూ తక్కిన ఖరీదు మాత్రము బొత్తిగా చెల్లక పొవడముండదు. కరువు మాడుతున్న వారు ఇల్లువాకిళ్ళు పెళ్లాం పిల్లలను అమ్ముకొనియైనా ఆ పెద్ద ఖరీదు నిచ్చి కొనుక్కొని తీరుతారు కాని చూస్తూ చూస్తూ చావనొల్లరు. చేతిలొ పుష్కలముగా డబ్బున్నవారు ముందుగానే కొనుక్కుంటారు కనుక వారికి మంచిదినుసు లభించుతుందు. తక్కినవాళ్ళు పెక్కు యీడుపోతలు పడి డబ్బుజాగ్రత్త పెట్టుకోవలసి ఒక్క దఫాను కొనుక్కొలేక ఉండి ఉడిగీ కొనుక్కోవలసి వస్తుంది కనుక అదే పెద్ద ఖరీదుకు  ఆ పిప్పిసరుకు వారికి లభించి వారి ననారోగ్యం పాలు అర్ధాయుస్సు పాలు చేయును. మరియెవరు
గరిమెళ్ళ వ్యాసాలు