పుట:Garimellavyasalu019809mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనకు కావలసిన క్రొత్త దృక్పధము పాశ్చాత్య నాగరికతకు ఈ సూత్రము విరోధము కావచ్చునెమో కాని మనదేశపు నాగరికతకు అట్లు కాదు. పాశ్చాత్య నాగరికత చరిత్ర అంతా పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళను తన్నడము, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళమీద తిరగబడి చంపడం ఈ విధంగా రాజులు ప్రభువులు, ప్రభువులు శ్రీమంతులు, శ్రెమంతులు దరిద్రుల మధ్య యుద్దములతోనే తెల్లవరుచున్నది. కని స్నేహసూత్రము యొక్క్ సారస్య మింత్ వర్కు వారికి బోధపడలేదు.

పాశ్చాత్యశిక్షణ ఫలితములు

పాశ్చాత్యుల కట్టకడపటి సుగుణము వారి సుశిక్షణము లేక డిసెప్లీను, ఈ డిసిప్లీను వల్లనే వారిలో ఐకంత్యమేర్పడి నల్లజతుల్ను దోచుకొని పీడింపగలుగుచున్నారు. ఈ దురాశ ధర్మమంటూ వారిలో వారు కొన్నాళ్లు తన్నుకోవడం మానినారు. గాని ఈదోపుడు వల్ల వచ్చే సంపదలను పంచుకోవడంతో ఒక్కొక్క దేశములోని వివిధ తరగతుల మధ్య వంతులు తెగక ఆ డిసిప్లిను అనే సుగుణము కూడా బీటవారిన గోడలాగ విరిగి పిన్న పెద్ద లుభయుల్ మీద్ను పడుచున్నది.

     పాశ్చాత్య నాగరికతా సంపర్కము తన్మూలమున వచ్చిన దారిద్ర్య్హము పోటీల వల్లనే మనదేశములో వర్ణకలహములు, కోర్టు యాత్రలు వర్తకపు మోసములు, ఫ్యాక్టరీల దురాశలు ప్రబలినవికాని అంతకు ముందు లేకుండా ఏ సంఘము ఉండగలదు? వ్యక్తి భేదమో, స్త్రీ పురుష భేదమో, యువక వయోజన భేదమో, కులభేదమో, అమ్మేవారు కొనేవారు భేదమో, యువక వయోజన భేదమో, రాజ ప్రజభేదమో, ఆచారం అనాచార భేదమో  యేదో ఒక్ రూపమున యేదో ఒక్ భేదమెక్కడ లేకుండా ఉండగలదు? భేద్ములుండుట్ సృష్టి దోషణము కాదు. ప్రకృతి సుగుణమే నేమో? ఆ భేదకారణముగా ఇతరుల దుర్భోధనలు విని మనలోమనము తన్నుకోవడంలో తప్ప యింకేందులోనైనా దోషమున్ందనుకొనుట్ పొరపాటనిపించును. ఇటువంటి చెడు దృష్టి మారిపోయి మనలోమనకు సమరస మేర్పడకపోతే మనకు
గరిమెళ్ళ వ్యాసాలు