పుట:Garimellavyasalu019809mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముక్తి రాదన్నమాట నిశ్చయము మనలో పెక్కు భేదములున్నవి. కనుకనే మనమందర్ము ఒకతి అని పాడిన రవీంద్రుని గీతము మనము స్మృతికి తెచ్చుకొనవలెను.

   నగరముల దృక్పధము మారితే అవి యెట్లు గ్రామములకు సహాయము చేయగలవో చూచితిమి గ్రామముల దృక్పధము మారితే అవి త్మ భేదములను పరుల దొర్భోదవల్ల కలిగిన క్షుద్రదృష్టితో కాకుండ సమరస పరస్పర సహకార దృష్టితో తిలకించి ఐకమత్యముతో వర్తించగలవు. మనకు కావలసినదంతా పాశ్చాత్యపరిపాలనా ప్రారంభము లగాయతు జరుగుచున్న అనుమానములు దుష్ప్రచారము తొలగుటయే. మనకు సవ్యముగ్ నిజ్ఞానముద్వారా ఐకమత్యము కుదరెనేని స్నేహము, సంపద, భోగము, సౌభాగ్యము, ఆరోగ్యము, బలము వర్ధిల్లి ప్రపంచమునకు మన గ్రామముల ద్వారాను నగరముల ద్వారాను కూడ మనము ఆదర్శము కాగలము. ఈ ఆదర్శము నవలంభించేవారు అవలింబవచ్చును. అవలంబించనివారు మునుపటిలాగే మరొకసారి మనమీద దాడి వెడలివచ్చినను, కమనము తాళుకోగలుగుతాము.
ప్రజామిత్ర, ప్రత్యెక సంచిక, 1939