Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాణిజ్యం * ఆరాచకం * విరుగుడు

మనకు స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరము గడచినది. కాని కరువు కాటకాలేమీ తగ్గలేదు. మరియు ధరలు దిన దిన ప్రవర్ధమానమగుచున్నవి. ఏ వృత్తిలో నైనా నిలకడగా యెంత సంపాదించుకున్నా నిముషములో హరించిపోవుచున్నది. వర్తకం చేసుకొని దొంగలాభాలు కట్టుకొనే వారికి తప్ప యెవరికీ యేమి మిగలకున్నది. ఏవో మోసపు మాటలు చెప్పి ఇతరుల వద్దగల ధనమును దోచేవారికి తప్ప నిజముగా కష్టపడేవారికి రోజు గడియకున్నది.

అందరూ అందలము నెక్కే వారే అయితే మోసేదెవరు? అందరూ వర్తకులైతే కొనుక్కునే వారెవరు? అందరికీ వర్తకము సాగించే మెళుకువలు, టప్పాలు కొట్టి ధనము తీయగల అవకాశములు లభించునా? అట్లు లభించే అవకాశము పూర్వము నూటికి పది మందికి కలిగితే ఇపుడు మహా అయితే నూటికి ఇరువది మందికి కలుగుచున్నదనుకోవచ్చును. తక్కిన యెనభైమంది పొట్టలను ఈ యిరవై మంది కొట్టి బాగుపడుచున్నారు.

ఆ యిరవై మందిలో నలుగురు మండీ వర్తకులు ...... వర్తకులు ....... వారికి లక్షల కొలది లాభములు వస్తే తక్కిన వారికి వందల కొలది లాభములు వచ్చుచున్నవి. ఎవరికెట్టి లాభములు వచ్చిన వినియోజకుల నెత్తి కొట్టి తీసుకున్న బాపతే కాని సవ్యమైనవి కావనుట నిక్కము.

ఈకాటకమున కంతటికిని కారణమేమిటి? సరుకులు తక్కువైనందువల్ల ఖరీదులు హెచ్చుచున్నవా? ఖరీదులు హెచ్చుటకొరకు వస్తువులు కనపడకుండుటయు, చివుకుటయు, కుళ్ళుటయు, తప్పని సరియైనప్పుడు మాత్రమే సరుకు కనబడుచున్నదా?

వీధిలో యే దుకాణములను చూచిన మునుపటి ధాన్యరాసులకు బట్టల మోపులకు, కూరల పోగులకు, దినుసుల తిప్పలకు తక్కువగా లేవు గ్రామాలలోని సంతలను చూచినా యీ విధముగానే ఉన్నవని అనుకోవచ్చును.

మునుపటికంటె సరుకే మాత్రమును తగ్గలేదు. ఆ మాత్ర మీ మాత్రము

గరిమెళ్ళ వ్యాసాలు

153