పుట:Garimellavyasalu019809mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దెరువాట్లు" కొట్టు పామరులను ససిసంగుట విద్యుక్తమై యున్నది కనుక వీరు నానారజ సందర్శనములు, గుంటూరు సీమలు, గీరతములు మొదలగునవి రచింపవలసి వచ్చును. ఇవి చాటు పద్యములవలె నొకటియును రెండును గాక పత్రికలు సంచిక లెల్లను నిండి కావ్యరూపములు దాల్చవలసి వచ్చినది. వీటికి జవాబులు ఇటువంటివి, యితరుల వివాదమ్లు మొదలగుననెల్లను కూడ ఖండకావ్యములుగా వెలసినవి. ఈ తగాదా లెల్లయును శతావధానముల కొరకు కదా! శతావధానములళొ నెవ్వరే యంశము మీద పద్యము చెప్పుమనిన దాని మీద చెప్పవలెను. ఇట్టి పద్యములలో నెల్లకయిత తళుక్కులు అలరారుచున్నవి. వీటికి నిజముగా నీ సందర్భములలో కాకుండినచో పూర్ణకావ్యములలో ప్రవేశమున కనువు దొరకక కవితా సంస్పర్శన భాగ్యము దక్కెడిది కాదేమో! ఇప్పటి అభలు కేవలము పండితుల సభలు కాక పాండిత్యము లెక ఆంగ్ల విద్యాధికులు మొదలగు వారి కూటములగుట చేత ఈ పద్యములు కొంత వరకు ఈ కాలమున కనువులై, సులభ గ్ర్రాహ్యములై యుండిక తీరినది కాదు. కాక వారు నిజముగ కవీశ్వరులు - నిజమైన కవీశ్వరులకు ఏ గ్రంధయుగములొనో పడి యుండుట కష్తము తమ చుట్టు పట్ల నున్న యుగము, నాగరికత, విలాసములు, ఉద్యమములు మొదలైన నెల్లయును వారి విమర్శలకు పాత్రములై కవిత్వములోనికి జొరబడును. వీరి పాణిగ్రహిత, శ్వవణానందము మొదలగు గ్రంధములు పేరునకు ప్రబంధములే యయ్యు సమకాలిక నాగరికత యొక్క పటములు, కాని యివి యన్నియు తాత్కాలికము అనియు, పుణ్యమును పురుషార్ధమును సంపాదించునవి కాదనియు, శాశ్వత కీర్తిని సంపాదించుకై యేమి, జన్మతరింపచేసుకొనుటకై యేమి, సుప్రసిద్ధ సంస్కృత గ్రంధములను బాషాంతరీకరించుటో నాటకములుగా మార్చుటయో దైవప్రశంసకంబులగు పురాణములను రచించుటయో కవి యొనర్పవలెనను ప్రాచీన విశ్వాససాంప్రదాయము ననుసరించి, కొన్ని సంస్కృత నాటకములు భాషాంతరీకరించుటయు, పాండవ జనవాది గ్రంధములను స్వతంత్రించి వ్రాయుటయు, దేవీ భాగవతమును తెలుగు సేతయు కూడ కలిగినది. వీనిలో గూడ పాండవ జనవాది నాటకములలో వారు తీసుకొన్న భావ స్వాతంత్ర్యమున్ను దేవీ భాగవతములో వారు కనపరచిన రచనా స్వాతంత్ర్య