పుట:Garimellavyasalu019809mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై పై కి వచ్చి విజృంభించిన వారికి దక్కులు సామాన్యము కనుక ఆ పట్టాభిషెకము వారికి కట్టుట యెవ్వరికిని యపచారము కాని యశ్రద్ధ కాని కానేరదు.

శవావధాని కవులు

  ముందు పద్య కవిత్వములలోని పరిణామములను పరిశీలింతము తిరుపతి వేంకటకవీశ్వరులు గత యుగ సాంప్రదాయములలో సిక్షితులు సంస్కృత సాహిత్య పారంగతులు, పండిత శ్రేష్టులు, సుధీవిరాజితులు, అసదృశ ధారావిలాసితులు అనెకుల కంచుఢక్కలు పగులగొట్టి దిగ్విజయ మొనర్చిన వీరులు.  వీరింతకు ముందరి యుగములో నుద్భవించి యుందురేని యేయొక్క రాజువొద్దనో పడియుండి, గూఢ శబ్దవితతిచే గుంభితములై యుండు ఏ కొలది పుస్తకములనో వ్రాసి, తమ యొద్దకు విద్యాసక్తి మెయి వచ్చునే కొలది మంది శష్యులలకో పాఠములు చెప్పి, తమంతటి వారిని చేసి తమ యశశ్శరీరమ్ల నీ ప్రపందముపై నాచంద్ర తారార్కముగ వెలయునట్లు విడిచిపెట్టి తమ యవతారములను చాలించి యుందురు. కాని కాలమానము మాఱిపోయినది. రాజులు  చితికిపోయి పెద్ద స్థితిపరెఉలుగా మాత్ర్రము మారి యగ్రహారములను రాగి పట్టాల మీద శాసనములుగా వ్రాసియిచ్చి దానము చేయగల స్థితినుండి జారిపొయినారు.  ఈ లాటి స్థితిపతులను పదిమందిని చక్కబెడితే కాని యొక కఫీశ్వరుని పొట్ట జరుగదు. కాక రైలుంబండ్లు హెచ్చి ప్రయాణ సౌక్ర్యములు చెలగు చున్నవి కనుక యొక్కని దగ్గర మాత్రమే వన్నీకెక్కుట కంటె పెక్కుర యెదుట కీర్తి గొందమను కొరిక పుట్టుట సహజము. కాక మునుపటి వలె శిష్యులు తమ వద్దకు అచ్చి శుశ్రూష చేయుచు జ్ఞానము గఱచుకొనెడి దినములు కావివి.  శిష్యులలరాడెడి పాఠశాలలోకి కొలువుక్జు వెళ్లి వాళ్లకు చదువులు వచ్చినను రకున్నను తనపని తాను చేసుకొని నెలజీతమును అణాముద్రపై సంతకము పెట్టి పుచ్చు కోవలసిన పద్ధతులివి. పాండిత్య్హమునకును వివాదమునకును విక్ష్వాకుల నాటి నుండియు చుట్టరికము, ఇరువురును పండితులయ్యు ఒకరికొకల్రు "త్వంశుంఠ" యంటే "త్వంశుంఠ" యనుకొనుట వారిలో మామూలై యున్నది.  రాజులక్ అల్పరాజుల నెల్ల మార్చుటట్లు పండిత కవీశ్వరులకు "గ్రంధపుం