పుట:Garimellavyasalu019809mbp.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రిక్కిరిసి యున్నందున వారి యెడల మొగమాటం వల్లను, ఆంధ్రులు చాలా బెట్టుసరి మనుష్యులగుట వల్ల వారి యెడల వెగటు వల్లను అతనట్లు వాదిస్తున్నారని మన మనుకోవలెను.

మిశ్రమ రాష్ట్రాలు, సంస్కృతిసమ్మేళనాసోపానాలు
   పెద్దభాషా రష్ట్రాలలోని సామాన్య ప్రజలకు తమ బాషను గాక ఇంకొక భాషను నేర్చుకోమని చెప్పడం బలవంతం కావచ్చును. కావలసిన వారెల్లాగా నేర్చుకోకమానరు. కాని మిశ్రమ భాషాప్రాంతం ప్రజలకు తమ భాషతో సన్నిహితభాషలను నేర్చుకోవడం కష్టం కాదు వద్ధన్నా వారి కాభాషలు ఆ సాహిత్యములు రాకపోవు. అది త్యంత సులభసాధ్యం కూడా మిశ్రమ భాషారాష్ట్రాలలోని ఇట్టి సాహిత్యాది సంపర్కాల మూలంగా కలిగే సంస్కృతీ పరిణామము ధరరుక్రమంగా సన్నిహిత భాష లన్నింటిలోకి ప్రాకకపోదు.
   ఈ విధంగా భారతదేశం ద్రావిడ్ భాషా సంస్కృతి ఖండం సంస్కృత ప్రాకృతభాషాసంస్కృతి ఖండం అను రెండు ప్రధాన భాగములుగా తయారవుతుంది. ఆ సంస్కృతులకు రెండిండికిని సమ్మేళన మనాది కాలంగా జరుగుచునే ఉన్నది. భాషలు వేరైనా భారతీయ సంస్కృతి యావత్తూ ఒకటే అని పరిచయస్థులందరికీ తెలుసును. అట్లగుటకు కారణమిట్టి సమ్మెళనమే.
 బహుభాషా సంస్కృతుల సమ్మేళనం చేయడం కంటే రెండు ప్రధాన ఖండములను సమ్మేళనం చేయడం సులభసాద్య్హం ఇందుకు దక్షిణాది మిశ్రమ రాష్ట్రాలెట్లు ఒకరీతిగా దోహదంచేయగలవో, ఉత్తరాది దక్షిణాది భాషల మిశ్రమ రాష్ట్రము లట్లు వేరొక రీతిని దోహదం చేయగలవు.
  శ్రీకాకుళం గంజాం జిల్లాల దోసందున, ఉత్కళ, ఆంధ్ర మిశ్రమ బరంపురం రాష్ట్రం మధ్య రాష్ట్ర ప్రాంతమున ఆంధ్ర హిందీ ఉత్కళ మిశ్రమ బస్తరు రాష్ట్రం బొంబాయి ప్రాంతమున్ గుజరాతీ మహరాష్ట్ర భాషా మిశ్రమ బొంబాయి రాష్ట్రం మొదలయినవి ఇట్టి మహాప్రయత్నమునకు యెంతో దోహదం చేసి, భాషాద్వేష, గండమును దాటించి, భాష లెన్నైను భారతదేశం
గరిమెళ్ళ వ్యాసాలు