పుట:Garimellavyasalu019809mbp.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతసంస్కృతి అంతా వివిధ రకాల చాయలతో కూడిన ఒకే మహాసంస్కృతి ప్రవాహమును సిద్దాంతమును రుజువు పరచగలవు.

 ఇట్లు ఒకె భారతీయ సంస్కృతి విజృంభణము  ముందు జరిగితే ఇతర చీనా జపాను ఐరోపా సంస్కృతులతో సంపర్కం సులభసధ్యమై "ఖండాలు వేరైనా ప్రపంచసంస్కృతి యావత్తూ ఒక్కటే సంస్కృతి సార్వజనీన" మను సిద్దాంతమును మనము ఆచరణలో పెట్టగలము.
    బౌద్ధమతమును మతమనుటకంటె భౌద్ధ సంస్కృతి యనుట లెస్స ప్రజలు దానిలో స్వచ్చందంగా చేరారు కాని, భౌద్ధభిక్షువులు నిర్భందించలేదు. హిందూమత మనేది అసలులో ఒక్ మతమేకాదు అనెక ఆచార తత్వసిద్ధాంతాల సమ్మేళనము అది యెవరినీ తన ఆచారాలలో తత్వసిద్దాంతములలో చేరమనలేదు. ఎవ్రి మతచారలలొ నుంచి వారు కదలకుండా ఉంటున్నె, విశ్వజనీన తత్వంపై కూడా దృష్టి నిగుడ్చుకుని మాత్రమే అది ప్రభోధించింది.
   ఆచారవ్యవహరాలు, ప్రార్ధనజపతపాది విధానాలు యెవరిష్టమైనయట్లు వారివి. కాని సంస్కృతి మాత్రం సార్వజనీనం. ఆడృక్పదం నుంచి యే మతమైనా భాషైనా జాతియైనా కళయైనా భిన్నించిందో సంస్కృతి కది గొడ్డలిపెట్టు. భారతదేశం ప్రపంచానికిచ్చిన ప్రధానసందేశమే యిది. ఈసందేశాన్నిముందు మన దేశంలో మనమే చిన్నాభిన్నం చేయ మొదలుపెడితే, మన సందేశాన్ని లోకం హర్షించాలని కోరడానికే మనకు హక్కు లేదు.
-కిన్నెర, ఆగస్టు, 1952