పుట:Garimellavyasalu019809mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చున్నందువల్లనే రాష్ట్రాలను భాషా ప్రయుక్తంగాను, మిశ్రమ భాషా ప్రయుక్తంగాను విభజించవలసిన అవసరం యేర్పడినదని అనుభవజ్ఞులకు విశదమగుచున్నది.

శ్రీ శాస్త్రిగా రింకొక విపరీత వాదం కూడా ఆ వ్యాసంలోనే చేశారు. కర్మంజాలక భాషాప్రయుక్త రాష్ట్రాలే యేర్పడితే మద్రాసు నగరమునకు ఆంధ్రులు తిలోదకాలిచ్చీవాలనీ, దానిని తమిళులకు ధారపోయాలనీ ప్రతిపాదించారు. అట్లు చేయకుంటే ఆంధ్రులు నగరపాలనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తమకు ప్రాతినిధ్యం కావాలని గగ్గోలు చేస్తారని వాదిస్తున్నారు. అనగా ఇప్పటివలె నగరంలో అరవలు తమప్రాబల్యమును హెచ్చించుకొని, ఇతర భాషల సంస్కృతితో కూడిన విశాల సంస్కృతిని మూలమట్టంగా అణచేసి కేవల ద్రావిడ కజగ సంస్కృతి ప్రధానంగాను అరవజాతి ఉద్యోగస్థుల ప్రాబల్యరంగంగాను, తెలుగువారికి కళాశాలల్లో సీటు కూడా లేకుండా చేసే రంగంగాను, మార్చజాలరని అతని ఉద్దేశమేమో! అట్టి ఉద్దేశమతనిది కాకుండును యని మన మెంత వాంఛించినను, అతని పలుకులట్టి ఉద్దేశ్యమతనికి కలదని చూపుతున్నవని తెలపుటకు విచారించుచున్నాను.

ఈ మోస్తరు సంకుచిత సంస్కృతి బద్ధములగు వాదములకు కేంద్ర ప్రభుత్వం ఆదరణ మీయరాదు. అరవల వాదం తప్పు అని తెలిసిన తరవాత కూడా "వారూ మీరూ పొత్తు కుదర్చుకోవలసిందే కాని పెద్దమనిషి పరిష్కారమునకు కూడా నేను ఒప్ప"నని జవహర్లాలు వాదించుచున్నందుననే అరవలు మరింత బిఱ్ఱబిగిసి మరికొన్ని ప్రాంతాలను కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేరకుండా మ్రింగివేయవలెనని ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రం ముందుగా ఆంధ్రుల కియ్యబడవచ్చుననే కారణమును పురస్కరించుకొని, ముందుగా వారు తమ హక్కులను మద్రాసు నగరం మీద నుంచి వర్జించుకోవలెననే గాక తమిళులకు మాత్రమే అర్పించవలెనని నిర్బంధించడం, ఒకనిని మూగవానినిగా మార్చి నోరుగల వాని చేత తిట్టించడంలాంటిది. జవహర్లాలు ఈ సంగతిని తెలుసుకోలేని మూర్ఖుడనుకొనజాలము. అయినా కేంద్ర సెక్రటేరియటు నిండా కీలకోద్యోగాల నిండా అరవలు136

గరిమెళ్ళ వ్యాసాలు