పుట:Garimellavyasalu019809mbp.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాషా ద్వేష ప్రాతిపదిక

  అందులో మన ప్రస్తుతానికి సంబంధించిన భాగమును మాత్రమే మనము ప్రస్తావింతము. అది యేదనగా భాషా మిశ్రమ రాష్ట్ర తంత్రము తెలుగు, అరవ, కన్నడ, మళయాళీ భాషల జాతులతో కూడిన ఒకేవిశాల మద్రాసు రాష్ట్రం అందుకు ప్రధమోదాహరణము ఉత్కళ మిశ్రమ మధ్య రాష్ట్రములు మూడవది. గుజరాత్ మహారాష్ట్రే మిశ్రమ భాగం నాల్గవది. బెంగాళీ బీహారీ మిశ్రమభాషా భాగం అయిదవది - ఇట్లనేక ప్రాంతములున్నవి.
   ఇట్లు భాషామిశ్రమ ప్రాంతాలను ఉంచినందువల్ల మాత్రమే ప్రమాదం లేదు. ఈ వ్యాసంలో మొదట తెలిపినట్లు అట్టి మిశ్రమ భారములను లేకుండా ఆపడం బ్రహ్మతరం కాదు. సద్వినియోగము చేస్తే అందువల్ల భారతీయ సంస్కృతికి దోహదం కలిగేది కాని ద్రోహం కలిగేది కాదు.
  దేశీయ రాజుల పాలనలొ బహుభాషాసమాదరణం
    భారతీయ పాలకుల హయాములో అట్టి సంక్రమ భాగాల వల్ల భారతీయ సంస్కృతికి దోహదమే కలిగేది. తిరువాన్కూరు మహారాజ స్వాతీతిరునాళ్ తన పాటలను సకలభాషలలోనూ వ్రాసెను. పంచాపకేశయ్యరు అను ఒక అరవ భాగవతారు హరికధా విదానములో "కాలక్షేపము" అను క్రొత్త ఫక్కీని త్రొక్కి, అట్టి కాలక్షెపములను కేవలం తన అరవ హరికధలలో మాత్రమే కాక, తెలుగు కన్నడం మళయాళం భాషలలోనికి పండిత గాయక వర్తులను సమీకరించి ఆయా భాషలలోకి కూడా ఆ విధానము జొప్పించెను. మైసూరు మహారాజులు దక్షిణ భారతీయ భాషలను, కళావేత్తలను సమాన గౌరవంతో చూచేవారు. కనుక సమస్త భాషలలోని విద్వాంసుల్కును గాయకులకును ఆ సంస్థానమాస్థాన పీఠమైనది. అందువల్లనే కాబోలు కవి సార్వభౌముడు శ్రీనాధుడు "ఎవ్వరేమనుకొన్ననాకేమి కొదవ నాకవిత్వంబు నిజము కర్ణాటక భాష" అని నుడువ సాహసించి నాడు. మరియు "కర్ణాటక కటక పద్మవనహేళి శ్రీనాధభట్టసుకవి" నని తన్ను తాను ప్రస్తుతించుకున్నాడు.
గరిమెళ్ళ వ్యాసాలు