పుట:Garimellavyasalu019809mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఫాదరీలు హెడన్ల క్రింద భావించి క్రీస్తు ద్వారా తప్ప యెవరూ మోక్షమును చేరలేరని నమ్మి ఇచ్చటి వారి నుద్దరించు ఉద్దేశంతొ బడులుపెట్టియో, ఆస్పత్రులు పెట్టియో, ఇతర ఆశలు చూపియో ఆ మతంలోకి అసంఖ్యాకులను చేర్చుకున్నారు.

  హిందువులు మాత్రం ఇతర దేశస్థులను మ్లేచ్చు లనలేదాయని యెవరైనా అడుగవచ్చును. కాని మ్లేచ్చులకు మోక్షం లేదని హిందూతత్వశాస్త్రము లెన్నడూ చెప్పలెదు. ఎవరి సంప్రదాయాలలో వారుండడం మంచిదని భావించి "అనారోగ్య" తుల్యమగు అశుచీభూతమగు సాంకర్యం కలుగరాదనియే వారి సంకల్పం. ఇతరులను నమ్మించో వంచించో  బలవంతానో తమలో చేర్చుకోక పోతే వారికి మోక్షంఅ లెదని వారు బావించలెదు. పైగ వారు చేసిన అపచారమింకొక టేమిటంటే ఆర్య బ్రహ్మసమాజాలు శుద్ది సంఘటన ఉద్యమాలు లేచేవరకు తమ సంఘం నుంచి ఇతర మతాలలోకి యెవరూ పోకుండా కట్టుబాటులైనా చేసుకోలేదు. ఎ మతం వారికైనా మోక్షం కలదను విశాలభావమగు వారి సంస్కృతియె వారి నట్టి కార్యూమునకు పురిగొల్పలెదు.
      ఇస్లాం క్రైస్తవ మత ప్రచారకుల వెనుక రాజకీయ సూత్రములు కూడా మిలితములైనవని కనుక ఆ వర్గాలలో దేశీయ ప్రజల పట్ల ఆచారముల పట్ల, సంస్కృతి పట్ల విద్వేషం ప్రబలింది. ఆ ఉభయవర్గాల వారూ పాలక "జాతు"లనీ ఇతరులగు దేశీయు లెల్లరూ పాలిత జాతులనీ ఒక అహంకారం ప్రబలి, ఉద్యొగసద్యోగాలు మొదలగు వరాలన్నీ మొదటి వర్గాల వారికి పక్ద్షపాతంతొ ఇయ్యబడేవి.
     ముఖ్యంగా గత భ్రిటిషు క్రైస్తవ పరిపాలన యుగంలో శుద్ధ శ్వేత క్రైస్తవుల (యూరోపియన్లు) కు అగ్రస్థానం బాగశ్వేత క్రైస్తవులకు (యూరోపియన్లు) ద్వితీయస్థానం, నల్లజాతి (భారతీయులలొ నుంచి కన్వెర్టయినవారు) క్రైస్తవులకు తృతీయ స్థానం గౌరవాలు ఒసగబడేవి. మిగిలిన బారతీయులలో కూడా చీలికలను పుట్టించి పెంచు ఉద్దేశముతోనే ఆ వరాలు క్రమమైన పాళ్లుగా పంచబడేవి. పాలనాచక్రం కూడా ఆ సూత్రం ప్రకారమే నడువబడింది.
గరిమెళ్ళ వ్యాసాలు