ఈ విధంగా పాలకులు పండితులు చేసిన భారతీయ సంస్కృతి దోహదమునకు తోడు ప్రజాసామాన్యము కూడా తమంతట తామే ఒక భాషా ప్రాంతంలోని విధానమును ఇంకో ప్రాంతంలోకి అనుకరించే వారు. యక్షగానము, తోలుబొమ్మలాట, భామకలాపం, భట్రాజు కవిత్వం మొదలగునవన్నీ ఇంచుమించుగా దక్షిణ భారతీయ ప్రాంతము లన్నింటిలో సరిసమానముగా వర్దిల్లినవి. మహారాష్ట్ర నాటక కంపెనీల దక్షిణ దేశ యాత్రవల్ల దక్షిణాది నాటకరంగమే భామకలాప యక్షగానములకు విభిన్నమైన ఒక నూతన ఫక్కీకి వచ్చిందని ప్రేక్షకులకు తెలుసును.
ఇదంతా యెందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఏ భాషవారైనా ఆ భాష ఒక్కటే తమ సొత్తు, తక్కిన భాషలు తమ శత్రువులు అనుభావముతో వర్తించలేదని తెలుపుటకే. ఇన్నిటికిని తెలుగు వరపంచాలలో తెలుగు నెలలు, ఇంగ్లీషు నెలలు, అరవ నెలలు, తురక నెలల పేర్లు పిల్లలకు పాఠము చెప్పబడుచున్నది. శ్రీకాకుళం జిల్లా గ్రామాలలో యెక్కాలు తెలుగులోను ఉత్కళ బాషలోను కూడా చాలాకాలం వరకు చెప్పబడుచుండెను. 11.11.121 మొదలు 20.20.400 వరకు గల యెక్కాల భాగమునకు ఇప్పటి కిని "యెగరన్నగిరీలు" పేరే ఆ ప్రాంతాలకు గల ఉత్కళ సంపర్కాభిమానమును తెలుపుచున్నది. అసలు "ఎక్కము" అను శబ్దమే ఓడ్రభాషాతద్బవం ఓడ్రంలో "యెక్కా" తెలుగులో యెక్కమైనది. ఓడ్ర ప్రాంతములకు దూరమైన తెలుగు భాగాలలో వానిని 'ఒంట్లు 'అంటారు. ఒక బాలుడు పెద్దవాడైతే కేవలం తన ప్రాంతాలలోనే కాలం వెళ్ళ బుచ్చవలసినవాడు కాడనీ, దేశంలో వివిధ ప్రాంతాలకెప్పుడో ఒకప్పుడేదో కార్యం మీద వెళ్ళవలసి వచ్చేవాడు కాబోవుచున్నాడనీ, అందుకు తగిన పరిజ్ఞానమును కొంతైనా బడి చదువులలో నేర్పాలనీ, ఆనాటి జనుల అభిప్రాయమని విశదమగుచున్నది.
ఇట్టి సమగ్ర పరస్పరాభిమానతుందిల భారతీయ సంస్కృతీ రంగంలోకి బ్రిటిషు కృత్రిమ రాజనీతిజ్ఞుడు విషభీజములను విరజిమ్మగలిగాడు. ఉద్యోగ సద్యోగాదులలో ఒక వర్గం వారి యెడ పక్షపాతం బూని ఇంకొక వర్గం వారిని అణగదొక్కించడం, ఒక ప్రాంతములోని ఆదాయమును తీసి ఆప్రాంతమును పస్తు పెట్టి రెండవ ప్రాంతంలో అభ్యుదయ ప్రాజెక్టులు నిర్మించడం మొదలైన చర్యల ద్వారా పరస్పరద్వేషాలను పురికొల్పాడు.
132
గరిమెళ్ళ వ్యాసాలు