పుట:Garimellavyasalu019809mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉండలేదు. అటువంటి నిర్వక్రస్థితికి అతనొక పార్టీ బయలుదేరతీస్తే వెంటనే మరోపార్టీ బయలుదేరుతుంది., ఎవరి పార్టీ బలం కొసం వారు యెటువంటి పనులనైనా చేయుటకు సంకోచించరు. మన గ్రామ పంచాయతీ సంస్థలు, నగర పరిపాలన సంస్థలు, కాంగ్రెసు సంస్ధలు, శాసన సభా సంస్థలు, ఇదీ అదీ అనడమెందుకూ అన్ని సంస్థలలోనూ నేడు ఇటువంటి పార్టీలే ఉంటున్నవి. అవన్నీ పైనున్న కొన్ని ఉత్తరోత్తరాదికార సంస్థల క్రింది ఉంటున్నవి కనుక యేలాగో ఒకలాగ యీడ్చుకొని వస్తున్నవి., తక్కినవి వేగం వేగం తెగిపోతున్నవి.

   ఈలాగైతే యేజాతియైనా యెప్పటికి అభివృద్ధికి రాగలదు? ఆంధ్రులు వెనుకబడుతున్నారు. ఆంధ్ర విజ్ఞానము కళకు ఆరిపోవుచున్నవి. ఆంధ్రులు నిరుద్యోగులగుచున్నారు. ఆంధ్ర రాష్త్ర సమస్య్ల ఆలస్యమగుచున్నది అని వట్టి వట్తి ఆందోళనలు చేస్తే యేమి లాభము? ఆంధ్రులు మొట్టమొదట తమలో ఐకమత్య్లమును సాధించుకోవాలి. అప్పుడే క్రిందనున్న పల్లెటూరు బడి మొదలు పైనున్న ఆంధ్ర రాష్ట్రముదాకా అన్ని సమస్యలు ఏకముహుర్తమున సులభముగా పరిష్కారము కాగలవు. అట్లుకాక ఈ అనేకత్వం ఉన్నన్నాళ్లు మనము ఈ యీడు పొతలన్నీ పడవలసినదే. ఆంధ్రులకు మొట్టమొదట కలుగవలసినది ఈ ఆంధ్ర చైతన్యం, కుల చైతన్యం, మతచైతన్యం, జిల్లాచైతన్యం, గ్రామచైతన్యం, వ్యక్తి చైతన్యం కలుగుట వలన వారు మరింత పరస్పర కలహములకే పాత్రులై అసలు చైతన్యమునే కోలుపోవుదురు కాని నిజమైన జాతీయాభివృద్ధిని పొందజాలరు.
   మనకు కావలసినది జీతీయచైతన్యము కాని, ఈ ఆంధ్ర రాష్ట్రీయ చైతన్య మెందుకని ఆక్షేపించేవారు కొందరు లేకపోలేదు.  ఈ మాట నిజమే కావచ్చును కాని ప్రతి రాష్ట్రమువారును తమ తమ చైతన్యములను ఆ రీతి నుద్దీపింపజేసుకొని సత్వరాభివృద్దికి వచ్చి భారతజాతీయ చైతన్యమునకు తగిన రీతిని దోహదము చేయుచుండగా ఆంధ్రులదెసమాత్రం వ్రేలుపెట్టి దీని నొక నేరముగా చూపుట పాడికాదు. ఇట్టి చైతన్య ముదయించినంత మాత్రమున ఇతరులపై అసూయ కలుగునని మన మనుకొనరాదు. వారి
గరిమెళ్ళ వ్యాసాలు