పుట:Garimellavyasalu019809mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతిభను ప్రశంసించు ద్వారానే మనకిట్టి చైతన్యజ్ఞానము కలుగవలెను. మన రాష్ట్ర విషయముల యందు మన కెట్టి గౌరవాబిమానము లుండునో అట్టివే ఇతర రాష్త్ర విషయములందును . అఖీల భారత విషయములందును, ఉండుటకు వీలులేదా? భాషా ప్రయుక్త రాష్ట్ర సమస్య కిట్టి వ్యాఖ్యానము నెవరును ఎన్నడును చేయలేదే తిలకు మహాశయుడే దీని నంగీకరించెను. జవహరాలాలే ఆమోదించుచున్నాడు. ప్రతినాయకుడును దీనిని ప్రశంసీంచుచునే యున్నాడు. నిజముగా రాష్త్రము లుండవలసిన పద్దతియే అది. అంతేకాని బ్రిటిషు ప్రభుత్వ రాష్ట్ర విభజన పద్దతి ఒక పద్దతియె కాదు వీలయినంతవరకు దానిని సవరించవలసినదే! దీని కాటంకము చెప్పుటలో వివేకము లేదు.

రాష్ట్ర సమస్య
  ఇట్టి రాష్ట్రమే మనకు తొలి నుండియు ప్రత్యేకముగ ఉండిన యెడల మన సమస్యలున్ స్థితిగతులుగు నేడింత వెనుకబడి యుండవు. మన సమస్యను దేనిని పరిష్కరించుటకును నేడు మనము కర్తలము కాకున్నాము. విద్యాసమస్య, పరిశ్రమల సమస్య ఆర్ధిక సమస్య; వ్యవసాయ సమస్య, నీటి పారుదల సమస్య, వాణిజ్య సమస్య యే సమస్య పరిష్కారము కావలెనన్నను మనకు పై అనుమతి ఒకటి కావలసియున్నది. ఆ పై అనుమితినిచ్చునది ఒక కలగాపులగం సంస్థయై యున్నది. అదియే మద్రాసు ప్రభుత్వము ఆ ప్రబుత్వమునకు అందరితో వలె మనమును కప్పములు కట్టుచున్నాము, విధేయతలు సలుపుచున్నము అబివృద్ధిని కల్పించుచున్నాము, కాని మన విషయమైన ప్రశ్న యేదైనా వచ్చినప్పుడు మన అందరి మాటా చెల్లుటకు వీలుకాకున్నది. ఆ ప్రభుత్వము తన అనుకూలము ప్రకారము ఈ ప్రశ్నకు సమాధానము చెప్పును కాని, మన అనుకూలము ప్రకారము మ్నకును, ఇతరుల అనుకూలము ప్రకారము వారికిని పరిష్కారమిచ్చే ఔదార్యము గలది కాకున్నది. కనుకనే భాషాప్రయుక్తరీతిని మనము నలుగురమును వేరువేరుగ నున్నచో అంద్రి సమస్యలును యధానుకూలముగా పరిష్కరించుకొనవచ్చుననియే మన సంకల్పము. ఎవరు  కాని దీనికి ఎందుకు అడ్డము చెప్పవలెనో అర్ధం కాకున్నది. ఇతరులను
గరిమెళ్ళ వ్యాసాలు