పుట:Garimellavyasalu019809mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వుండడము, ఫారముల వల్ల వచ్చే శిస్తులను వసూలు చేస్తు వుండడము పేష్కరులు కడుతూ వుండడము మిగిలనది ఆ ఫారముల అభివృద్ది కోసమో, యితర సంస్థల పోషించుట నిమిత్తమో వ్యయము చేస్తూ ఆదర్శజీవనము జరుపుతూ, ప్రభుత్వపు టంగములలో ముఖ్యములగు అంగములుగా నుందుటయే ఇట్టి బారమును వహింపగల ఆవేశము వుత్సాహము పుట్టించి కొందరిని శోధన చేయడం మంచిది.

     పూర్వవాసనలు కొంత దులుపుకుంటే, వారీ కార్యములకువుత్సాహముగా దిగగలుగుతారు. వారు దులుపుకో లేకుంటే, వారిని వెంటనే తోలగించవచ్చును కందకు లేని దురద బచ్చలికి అవసరము లేదు.
  ఇట్లే మిల్లులను కంపెనీలను బ్యాంకులను కూడా సంస్కరింప గడగవలెను. ఆర్గనైజర్లుగా, తనిఖీదార్లుగా, మేనేజర్లుగా వ్యవహరిస్తూ ఒక నిష్పత్తి ప్రకారం తమ ఫలమును అనుభవిస్తూ మిగిలనది వాటి వృద్ధి కొరకును యితర సత్సంస్థా ప్రవర్ధానము కొరకును వారు వినియోగింప సంకల్పించుకొంటే మంచిది. అట్లుకాక మునుపటి త్రొవనే వర్తిస్తామంటే వారికి కూడా స్వస్తి చెప్పవలెను.
 కాగా, అప్పటికి మనకు కమ్యూనిజము మాత్రమే గతి అవుతుంది. సోషలితమును యీ విధముగా నడిపించలేని మనధీరులు కమ్యూనిజమ్ము నేమాత్రము నడిపించగలదు? రష్యా మనకు సాయం చేవవస్తుంది. మనకూ, దనికి పుస్తె అవుతుంది. మనజాతీయతత్వమునకు సంప్రదాయమునకు తర్పణమవుతుంది. రానున్న అమెరికా రష్యా యుద్ధములో మన మెక్కపక్షంలో పడి నలిగిపోతాము. కనుక పై చెప్పిన సోషలిజము విధానమును దేశీయు లెల్లరును బలపరుతురు గాక.
- ఢంకా, సెప్టేంబరు, 1947