పుట:Garimellavyasalu019809mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతదేశానుగుణమగు

కమ్యూనిజము కావలెను

   ఇది యొక విచిత్రమైన కాలము. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవి అబద్దపు చేతలు చేసేవి గంగాస్నానాలు, దూరేది దొమ్మరి గుడిసెలు పైకి కనిపించేదిధ్రావతారం, లోపల వెలసినది కుటింతా కుహరం ఈ కళలలో ఆరితేరినవారికి మూర్ధాభిషేకాలు, అవి యెరుగనిధర్మాత్ములకు అధ:పాతాలాలు.
   ఇటువంటిమహాసామ్రాజ్యానికంతటికీ మకుటం ఐక్యరాజ్యసమితియు దాని చెలిమికత్తెయగు భద్రతామండలియు దాని పాలనలోనలిగేవి అనంతకోటి మానవజీవరాసులు. దానికి ఆప్తులుకానివారికైనా దాని మీద ఆశపెట్టుకొకపొతే గతి లేదు. దాని శాఖలనంతములు- ప్రపంచఆహారొత్పత్తిసరఫరాశాఖ, ప్రపంచపరిశ్రమాభివృద్దిశాఖ, ప్రపంచ కార్మిక శాఖ, ప్రపంచవిజ్ఞాన శాఖ, ప్రపంచ్వజ్ శాంతి సుహృద్బావశాఖ - అన్నీ విశ్వ ప్రపంచశాఖలే.
   ఈ సమితి వల్ల ఈ మండలి వల్ల ఈ శాఖల వల్ల ఎవరికేమి మేలుకలుగుచున్నదో ఈశ్వరునికెరుకకాని ఎవ్వరికినీ దండుగలు, పరాధీనతలు, నిస్సహాయతలు తప్ప లేదు దీని కంతటికిని అధిష్టాన దేవత అమెరికా, ఉపదేవతలు బ్రిటను, ఫ్రాన్సు మొదలైన వర్గాల వారు ఏ తగాదా తీరాలన్న ముఠాలు తీర్పుచెప్పాలి ఆ ముఠాలు అమెరికా ఆజ్ఞలను పాలించి తీరాలి. అట్లుకానివారు అమెరికా సహాయము వారికి చిక్కదు. అమెరికా పగ వారికి నిక్కము. వారికి కావలసిన సరఫరాలు అందవు సరే గదా, స్యయం సహాయముకూడా సాధ్యముకాదు. నవరంధ్ర నిర్భంధమై త్రాహి త్రాహియని అవి చూడవలసిందే జర్ననీ, జపాను ప్యాపిష్టులు తమ చుట్టుపట్ల వారి నెవరినో భయపెట్టిదిగ మ్రింగరేమో కాని, నేడు అమెరికా విశ్వప్రపంచమును అతి తమాషాగాదిగమ్రింగి పాదాక్రాంతము చేసుకొనుచున్నది. బట్టగాని లెకుంటే ఈ భేతాళుడు ఈపాటికి విశ్వప్రపంచమును తన వలలోకి ఆకర్షించుకొని యధేచ్చాతాండవ మొనరించేవాడు.
   రష్యాకూడా అమెరికాకు సరియైన ఉజ్జీయే. తన చేతిదొక కాసు దండుగ