పుట:Garimellavyasalu019809mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేకుండా ప్రతి దేశములోను యెక్కడక్కడ కమ్యూనిష్టు సమ్మెలను రేకెత్తించి జెకోస్లేవొకిగా, ఫిన్లండు, రొమేనియా మొదలగు తూర్పు యూరపు దేశములను జీర్ణీంచుకొన్నది. గ్రీసుమీదికి పంజాను చాచినది. తన వంతు జర్మనీని దిట్టము చేసుకొన్నది. ప్రతి ప్రాచ్య ప్రతీ చీ దేశమునందును తన కమ్యూనిష్టుపార్టీలచేత వీలయితే యుధ్దాలుకాకుంటే సమ్మలు చేయించుచున్నది. చీనాలో దాని చారలు పారుచున్నది. పాలస్తీనా యూదులలో దాని చారలు కనిపించుచున్నది. తనవంతు కొరియాను గుప్పట పెట్టుకొని అమెరికా వంతును టకటకలాడించ్వుచున్నది. అమెరికాది కెవలము అర్ధనీతి కాని రష్యాది జటిలమగు రాజనీతి, అర్ధనీతి పారినన్నాళ్లు పారి బెడిసి కొట్టవచ్చును కాని రాజనీతికి ఆపజయము రాదు.

   ఈ మహా ప్రపంచములొ నేడు భారతదేశము చిక్కుపడియున్నది. బ్రిటిషు వాడు తానిక్కడ ఉన్నప్పటికంటె వెల్లుతూ ఈ దేశమును రెండు ఖండములు చేసి పగను తీర్చుకున్నాడు. వెళ్ళిన తరువాత ఐక్యరాజ్యసమితి చర్చలు పాకిస్తాన్ సహకారముల ద్వారా హిందుస్తాన్ పై వేయిరెట్లెక్కువగా పగసాధించుకుంటున్నాడు. ఇప్పటి మన కష్టాలన్నిటికీ కీలకము వాడే. అయినను తన పయోముఖము ద్వారా తనంత ఉదారుడు మనకు దొరకడనిమనకేంద్రాదిప్రభుత్వములనుండేసన్నుతులను, తన సామ్రాజ్యమును వీడమనీ, తనకు వర్తక సౌకర్యములు చూపుతామని వాగ్ధానములను గొనుచున్నాడు.
     బ్రిటిషు పిశాచము ఉండినప్పటికంటేకూడా ఊడిమరీ పీడించుచున్నది. దేశము పొడుగునా ఆట పట్టులను నిర్మంచుకొనుచు, అదృశ్యముగానే అణగి అనేకము పితూరీలను రేబట్టుచున్నది.  ఈ మాయతెర విప్పడానికి కాంగ్రెసు వశముకాదు. ఏలననగా కాంగ్రెస్సేకొరికోరి యీవలను కొనుక్కొని అధికార స్వీకారము చేసుకొని పడరాని అనుభవములు పడుచు, పరువుకోసం మాత్రం తాపత్రయము పడుచున్నది.
  భారతీయులు, వారిలొ ముఖ్యముగా హిందువులు బ్రిటిషు వాడికేమి కీడు చేశారో చెప్పజాలము. తమ బుద్ధి బలము నెల్లయు ఎరువిచ్చి, సామ్రాజ్య నిర్మాణములో వానికి సహాయ బూతులవడమే ప్రధమ తప్పిదము. ఆ యుగమహాత్వమట్టిది. అది విధికృతము, దానికిప్పుడు వగచిన లాభము లేదు.
గరిమెళ్ళ వ్యాసాలు