పుట:Garimellavyasalu019809mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రస్తుతం భూమిలేక వ్యవసాయం సమస్య మనకు గండమై వుంటున్నది. జమీందారీలలో నేమి గవర్నమెంటు జిరాయితీలలో నేమి చిన్న చిన్న చీలికలే కాని, యె కాంద భూములెక్కడా కానరాకున్నవి. కలెక్టివు ఫార్మింగుకు యేమి, ట్రాక్టర్ల ద్వారా దున్నించడానికేమి. ఇట్టి భూస్వామ్య పద్దతి చాలా ఆటంకకరమైనది. భారీ యెత్తున వ్యవసాయం సాగించకుంటే, ధనం పంటలమీద కంటే ఆహారం పంటల మీద యెక్కువ శ్రద్ధ నిగడింపకుంటే యిప్పటి కరువు తీరదు. తిండికిగుడ్దకు యితర దేశాల మీద ఆధారపడిన ప్రయోజనము లేదు.

   ఇకముందు యేస్టేటులను ట్రాక్టర్ల వల్ల దున్ని, కలక్టివు విదానముగా పండించాలి, వాటిమీద యే పంటలు పండించాలో యే పంటలు వేయకూడదో ప్రభుత్వం వారి ప్లానింగు కమీషనులు నిర్ణయించాలి. కనుజ్క రైతులందరూ ఒక ఫారం యావత్తూ తమ అందరిదీ అనేదృష్టితోనే వర్తించాలి కాని యీచీలిక నాది, ఆ చీలిక నీది అనే తగాదా దృష్టితో వర్తించరాదు. కొంతకాలం వరకు వారి ప్రస్తుతపు టాస్తుల మొత్తములను బట్టి వారి ఫలసాయముల నిర్ణయం జరుగుతుంది. తరువాత వారి కుటుంబ సభ్యుల సంఖ్య, వారి శ్రమల యొక్క తరగతి, వారి అవసరముల యొక్కస్వభావము లను బట్టి ప్రతిఫలములు మారుతూ వుంటవి. ప్రస్తుత పరిస్థితిలో గడుసువాళ్ళకు కంచం నిండా అన్నము మెత్తని వాళ్ళకు ఉత్త ఆకులు లభ్య్హమగుచున్నవి. పుండాకోరు తంత్రగాండ్రు కోటీశ్వరులవడము, ధర్మాత్ములు వారికి దాసులవడము తటస్థించుచున్నది.  దేశద్రోహులకు బిరుదులు దేశభక్తులకు లాటీ చార్జీల దినములు గతీంచినా పై అరాచకము లింకా పోలేదు. ఇదే యిప్పుడు తారుమారు కావలెను.
   క్రొత్తవ్యవసాయక విదానములో యిష్టమైతే యిప్పటి జమీందారులలో కొందరిని వారి జమిందారీలలోని ఫారములను తనిఖీ చేస్తూ, పరిశీలిస్తూ యెక్కువ అభివృద్ధి కారకముగా వర్ధిల్లుటకై నిలబెట్టవచ్చును. వారిపని మునుపటి వలె, యింట్లో కూర్చోవడము శిస్తులు వసూలు చేయడము. పేష్కరు కట్టడము మిగిలినది దుర్వ్యయము చేయడము కాకుండా, ఫారముల వ్యవహరమునంతటినీ సవ్యముగానో, తాబేదారుల ద్రారానో పరిశీలిస్తూ
గరిమెళ్ళ వ్యాసాలు