పుట:Garimellavyasalu019809mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేదా అని మాత్రమే చూచుకొవలెను గాని, యెవరిది యెక్కువ యెవరికేది తక్కువ అన్ పితలాటకములోనికి దిగితే లోకమున కెన్నటికిని శాంతి గాని పురోభివృద్ది గాని చేకూరదు.

  కనుక రానున్న భారతదేశపు సోషలిజములొ కవులకు గాయకులకు నిర్మాతలకు శ్రామికులకు పత్రికా సంపాదకులకు పండితులకు అందరికి స్థానం ఉంటుంది. ఎవరి స్థాయికి సరిపడునట్లు అందరికి ప్రతిఫలములు భోగములు చిక్కి వీలయినంత తీరిక ధనము మిగులునట్లు యేర్పాటులుంటవి. ఎవరి తీరికను గాని మిగిలిన దనమును గాని దుర్వినియోగము చేయకుండా సద్వినియోగము చేయడానికి సత్సంస్థలు సదవకాశములు నిర్మించబడుతవి.
  ఒకరి వద్ద యెక్కువ ఆస్తి, జ్ఞానము, శక్తి, లేక శీలము వున్నదని యితరులు యీర్ష్య పొంద్నక్కరలేదు. అందరి శక్తుల ఫలమును అందరికిని పంపకమగునట్లు సత్సంప్రదాయములు నెలకొల్పబడును  ఇది మనదేశపు సనాతనఘాతలు కలిగించి, నిర్వీర్యము చేసి, మనలనందరిని అర్ధదాసులుగను, పరప్రభువుల బానిసలుగను దాస్య పదవులు, బిరుదులలో కుళ్ళును గురించు బానిసలు గను మార్చివైచినది. మన వైజ్ఞానిక సంప్రదాయములు మనకు వెగటు అయినవి. నవనాగరికతా పిశాచపు ప్రళయ తాండవము మనకు ఆనంద సినిమారంగమైనది. శ్రమపడడము నీచమని, దొంగదారుల శ్రీమంతులమై భోగములతో కుళ్ళడము గౌరవమని భావించుకొనే దురవస్థలకు వచ్చినాము.
  కొంతమంది మిల్లు యజమానులు, జమిందారులు, వర్తకులు, పైక్యాపిటలిష్టు విదానములో పూర్తిగా కుళ్ళీపోయినారు. వారిని దారిలోకి తీసుకొనిరాగడం దుస్తరము. వరికి కూడా అట్లు వచ్చి, మానసేవ చేదామనే సంకల్పం శూన్యమైనది. వారికి  జీవనభృతులను పారవేసి విసర్జించిచడమే తగిన పద్ధతి. అట్లుగాక ఇంకా సంప్రదాయములకు, నీతికి, మానవసేవా పరాయణ త్వము నకు హత్తిపెట్టుకొని పనిచేయగోరువారు వారిలో కొందరు గలరు. పోయినవారు పోతే మిగిలిన వారు ఆదర్శప్రాయముగా వ్యవహరించగల అవకాశములు కుదురును.
గరిమెళ్ళ వ్యాసాలు