లేదా అని మాత్రమే చూచుకోవలెను గాని, యెవరిది యెక్కువ యెవరికేది తక్కువ అను పితలాటకములోనికి దిగితే లోకమున కెన్నటికిని శాంతి గాని పురోభివృద్ధి గాని చేకూరదు.
కనుక రానున్న భారతదేశపు సోషలిజములో కవులకు గాయకులకు నిర్మాతలకు శ్రామికులకు పత్రికా సంపాదకులకు పండితులకు అందరికి స్థానం ఉంటుంది. ఎవరి స్థాయికి సరిపడునట్లు అందరికి ప్రతిఫలములు భోగములు చిక్కి వీలయినంత తీరిక ధనము మిగులునట్లు యేర్పాటులు ఉంటవి. ఎవరి తీరికను గాని మిగిలిన ధనమును గాని దుర్వినియోగము చేయకుండా సద్వినియోగము చేయడానికి సత్సంస్థలు సదవకాశములు నిర్మించబడుతవి.
ఒకరి వద్ద యెక్కువ ఆస్తి, జ్ఞానము, శక్తి, లేక శీలము వున్నదని యితరులు యీర్ష్య పొందనక్కరలేదు. అందరి శక్తుల ఫలమును అందరికిని పంపకమగునట్లు సత్సంప్రదాయములు నెలకొల్పబడును. ఇది మన భారతదేశపు సనాతనఘాతలు కలిగించి, నిర్వీర్యము చేసి, మనలనందరిని అర్థదాసులుగను, పరప్రభువుల బానిసలుగను దాస్య పదవులు, బిరుదులలో కుళ్ళుచు గరించు బానిసలు గను మార్చి వైచినది. మన వైజ్ఞానిక సంప్రదాయములు మనకు వెగటు అయినవి. నవనాగరికతా పిశాచపు ప్రళయ తాండవము మనకు ఆనంద సినిమారంగమైనది. శ్రమపడడము నీచమని, దొంగదారుల శ్రీమంతులమై భోగములతో కుళ్ళడము గౌరవమని భావించుకొనే దురవస్థలకు వచ్చినాము.
కొంతమంది మిల్లు యజమానులు, జమిందారులు, వర్తకులు, పైక్యాపిటలిస్టు విధానములో పూర్తిగా కుళ్ళిపోయినారు. వారిని దారిలోకి తీసుకొనిరావడం దుస్తరము. వారికి కూడా అట్లు వచ్చి, మానవసేవ చేదామనే సంకల్పం శూన్యమైనది. వారికి జీవనభృతులను పారవేసి విసర్జించడమే తగిన పద్ధతి. అట్లుగాక ఇంకా సంప్రదాయములకు, నీతికి, మానవసేవా పరాయణ త్వమునకు హత్తిపెట్టుకొని పనిచేయగోరువారు వారిలో కొందరు గలరు. పోయినవారు పోతే మిగిలిన వారు ఆదర్శప్రాయముగా వ్యవహరించగల అవకాశములు కుదురును.
గరిమెళ్ళ వ్యాసాలు
105