పుట:Garimellavyasalu019809mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సర్వమును మరచి ప్రభుత్వ విధానమును కీర్తించుచుండుటలో పరవశులగుచుందురు.

    నిజమైన సోషలిజములో ప్రభుత్వము సర్వధికరియైనా భారము నంతటినీ తన నెత్తిపైన పెట్టుకొని మోయనొల్లక ప్రజలకు వారి వారి ఆర్ధిక, నైతిక, వైజ్ఞానిక, శ్రామిక స్థాయిలను బట్టి బాద్యతలను ఉచితరీతిని పంచి, వారు సక్రమముగ నిర్వస్తూ వుంటే  ప్రశంసిస్తూ అక్రమ సూచన లేమైనా కనిపిస్తే నివారిస్తూ, పై పెత్తనము మాత్రము చలాయిస్తూ ఉంటుంది. "ఏప్రభుతము అతి తక్కువగా పరిపాలిస్తు వుంటుందో అది ఉత్తమ ప్రభుత్వము" That Government is the best which governs he least" అని ఒక సామెత ఉన్నది. కమ్యూనిజము తానే సర్వము వహించి ప్రజలను అబాద్యులుగా చేయడానికి పూనుకొనుచుండగా, సోషలిజము సర్వమును ప్రజాసంస్థల కొప్ప చెప్పి తాను పై అజమాయిషీ మాత్రము చెలాయించుచుండును. ఇంక ప్రస్తుతపు క్యాపిటలిజము లేక ఇంపీరియలిజము లోనా, ధనవంతులును పెట్టుబడిదారులును ప్రభుత్వమును తమ పిడికిటిలో పెట్టుకొని, ఉద్యోగస్ధులకు లంచాలు, వర్తకులకు పెద్ద కమీషనులు యెరవేసి వారి నీతులను చెరపి, ప్రజల కష్టాల వల్ల కలిగే ఫలితాల నన్నింటినీ తామే హరించుకుని, లోకమంతా యేడుస్తూ వుంటే తాము మాత్రము బంగారపు తూగుటుయ్యలలో ఊగుచుందును.
  కనుక కడపడి దానికంటే, మొదటి రెండింటిలోయేదైనా నయమే ఆ రెండింటిలో సోషలిజము శ్రేష్టమైనదని, భారతదేశ తత్వమునకు అనుగుణమైనదనీ చెప్పవచ్చును.
  మానవులలో సమాననైతిక, ఆర్దిక, వైజ్ఞానిక, శ్రామిక సంపదలు నెలకొల్పడము ఉత్తమ ఆశయమే కాని తక్షణ సంప్రాస్త్యముకాదు. వారి వారి మానసిక శారీరక తత్వముల్ను బట్టి వారు కొందరు ఉత్తమ వ్యవసాయకులుగా, ఉత్తమ యజమానులుగా, మేనేజర్లుగా, ఆర్గనైజర్లుగా, కవులుగా, గాయకులుగా, వీరులుగా, పాటకులుగా, పరోపకారవ్రతులుగా, యోగులుగా ఆ పరిణామములు పొందుతూ వుంటారు. అందరినీ యేక మట్టముగా చేదామనే సంకల్పము సాధ్యమూ కాదు వివేకము కాదు. అందరి వల్లా అందరికీ లాభము కలుగుతున్నదా
గరిమెళ్ళ వ్యాసాలు