పుట:Garimellavyasalu019809mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెదిరిపోయిన పూసల నన్నిటిని యెలాగో ఒకలాగ తిరిగీ దారములో గుచ్చుటకు, బ్రిటిషు ప్రభుత్వమవలంభించిన కృత్రిమ పద్దతియే కాంగ్రెస్సుకును శరణ్యమైనది. ముస్లిములు, క్రిష్టియను ప్రత్యేక నియోజక వర్గాలను కాంగ్రెస్సుకూడా ఆమోదించినది. ఇరువది యొక్క రోజులు ఉపవాసము చేసి నిమ్నజాతుల ప్రత్యేక నియోజక వర్గం నెట్లో గాందీ ఆపగలిగినాడు.

  ఈ విధముగా కొందరికి ప్రత్యేక నియోజక వర్గాల నామోదించి నందున వారి వారిని ప్రత్యేకజాతులుగా భావించిన దోషము కాంగ్రెస్సుకు పట్టినది. క్రైస్తవులు తాము భారత జాతి వారమని యే పుణ్యము వల్లనో ఒప్పుకున్నారు. కంజుక సరిపోయినది కాని, మహమ్మదీయులవలె తామొక ప్రత్యేక జాతివారమని వుండీ వాదన చేస్తే స్వయం నిర్ణయ సూత్రం ప్రకారం వారి కొక "క్రాసుస్థానం" ను కాంగ్రెసు బ్రిటిషు వాని తంత్ర మహిమవల్ల "విభిన్న జాతీయత" లకు ఆలవాలమైనది. దావిడ స్థానాది ప్రత్యెక స్థానాలవాద్ము రైతు, కార్మిక, చేనేత మొదలయిన వృత్తి వర్గవాదములు ఒక మొస్తరుగ విభిన్న జాతీయతలకొక దారితీయుచు జాతీయ దేశీయ ఐక్యతకు భంగం కలిగ్ంచుచున్నవి. బ్రిటిషువరు పోయిన తరువాత కూడా ఈ అల్లకల్లోలము నుండి గాంధీ కాంగ్రెస్సు తప్పించుకొనజాలకున్నది.
   కనుక కాంగ్రస్సును సంస్కరించక తప్పదని గాంధీజీ గ్రహించినాడు. మొట్టమొద్టి మెట్టుగా పావలా రుసుం బాధ్యతను తొలగించి, దేశమునందలి సర్వ పౌరులను కాంగ్రెస్సు సభ్యులుగా భావించుకొనునట్లు అతను యేర్పాటు చేసినాడు. దేశంలో అనేక రాజకీయ పక్షాలుండవచ్చును గాని యే పక్షమును తను కాంగ్రెసు పక్షము ననుకొని తత్కారణముగా తక్కిన పక్షముల కంటె గొప్ప దానినని గర్వించుటకు వీలు లేకుండా చేసినాడు. కాంగ్రెస్సు ఈ విధముగా స్వతంత్ర దేశాలలో ఎల్లాగ సార్వజెనీన సంస్ద గా వుంటున్నదొ ఆవిధముగానే ఇక్కడ కూడ వుండుటకు ఆధారము కలిగించినాడు. సర్వజ్నసమాధాన సమ్మోదములను బడయ వలసిన ఏయొకటి రెండు ఉత్కృష్ట సమస్యలో తప్ప తక్కిన రాజకీయ ప్రణాళికకు దానితో సంబంధం లేకుండా రాజకీయ పక్షముల చాకచక్యములు బలంప్రాశస్త్యంతో మాత్రమే సంబంధ ముండేటట్లు చేసినాడు.
గరిమెళ్ళ వ్యాసాలు