Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాంధీ మహాత్ముడు చాలా కాలము క్రిందటనే పావలా రుసుము లోని లోపమును అసభ్యత్వమును గుర్తించి యుండవలెను. అయితే దీపారాధనకు డబ్బు లేకపోతే తాను సృష్టించిన క్రొత్త కాంగ్రెస్సు సంస్ధ వర్ధిల్ల నేరదని తలచి కాబోలు అప్పటిలో తానేమియు మాట్లాడలేదు.

  దేశానికి పోరటము వల్ల స్వతంత్ర్య్హం వస్తే అది సర్వజన సహకారం వల్ల వచ్చినదని చెప్పుకొనుటయే కొంత ఉత్తమము కాని, ఎంత త్యాగము చేసిన యేదో ఒక పక్షము మూలముగా మాత్రమే వచ్చినదని చాటుకొనుటకు లక్షణము కాదు. నేటి ఉత్తమ కాంగ్రెస్సు నాయకులలో కొందరైనా అట్లు ప్రకటించని వారున్నారు. అదియే నిజమైన వినయ లక్షణము.
   అయితే ఒక్కొక్క విజయమువంటిది సమకూరుతూ వుంటే, కాంగ్రెసు రాజకీయ పక్షముగా వ్యవహరించిన వారిలో వినయము తగ్గుచు అది కేవలం తను యొక్కని ప్రజ్ఞాఫలమే యను అధికారము వ్యాపించినది. దీనికి సయము గాంధీ కాంగ్రెసు రాజకీయపక్షమువారు తమ చర్యలనన్నింటినీ, బ్రిటిషు ప్రభుత్వము నెల్లాగో ఒక లాగా మెడ గెంటడానికి బదులు దానిని విలువదీసియో సమాధాన పడియో రాజకీయాధికారమును పిండుకొందామని సంకల్పముతో ప్రవర్తించినందువల్ల, బ్రిటిషు ప్రభుత్వమునకు తాను నిలువగలనను హామీ యొక ప్రక్కన చిక్కుటయే గక, కాంగ్రెసు పక్షమును సన్నగిల్ల్ చేయుటకై ఇతర పక్షములను కూడ చిక్కినది. అవతల ముస్లిము లీగు పక్షము, ఇవతల షేడ్యూలు తరగతుల పక్షమును, ఇంకొక ప్రక్క, ఇండియన్ క్రిష్టియన్ పక్షమును ఈ విధముగా ఎన్నో పక్షాలను లేవనెత్తి వారి వారిని ప్రత్యేక నియోజక వర్గాలు, ప్రత్యేక పదవీ స్థానములు, ప్రత్యేక సౌకర్యములు తక్షణ ప్రత్యేక రాష్ట్రాలు మొదలగు ఎఱలను చూపి దేశమును చిన్నాభిన్నముగ చీలికలు చేయగలిగినారు.
    ఈ మహారణ్యములో కాంగ్రెస్సు తాను సార్వజనీన సంస్థ్నని శోకిస్తే యేమి లాభం? ప్రత్యేక నియోజకవర్గాలను ఆక్షేపిస్తే యేమి ఫలం? దేశం యెల్లాగా చెల్లాచెదరవుచున్నది. కాంగ్రెసు వ్యాపించిన రాజకీయ చైతన్య్హం కూడా ప్రజా గణముల్కు ఈ తప్పుత్రోవలలో పోవడానికే సధనమలయింది.
గరిమెళ్ళ వ్యాసాలు