పుట:Garimellavyasalu019809mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోల్పోయినారు. కాంగ్రెస్సు సభ్యత్వము కొన్ని పదవులకు ఆచారమై నందున కొందరు పావలాడబ్బులు చెల్లించి సభ్యులయ్యేవారు. గడుసరులు కొందరు కొన్ని వేల పావలాలను ఖర్చు పెట్టి అంతమంది అనుకూల సభ్యులను చేర్పించుకొని వారి మూలకముగా తమ కనుకూలములగు పదవుల్ నెక్కగలిగినారు. మునిసిపలు కౌన్సిలు ఎన్నికలు, శాసనసభల యెన్నికలలో కాంగ్రెసు యెన్నికలు కూడా కశ్మలములైనవి. క్రమక్రమముగా అది ఒక ప్రత్యక్షరాజకీయ పక్షమై కాంగ్రెస్సు హోదాతో సర్వవిధములయిన పదవులవేటకు దిగి, సంస్ధ పేరు బలమువల్లను, అందలి సభ్యులు చేసిన త్యాగముల మహిమ వల్లను ఇతర పక్షములవారిని ఇట్టే సులభముగా ఓడించగలిగినది. ఈ విధముగా కాంగ్రెస్సు బలము యెక్కువ యైన కొద్దీ దాని సార్వజనీన ప్రాతినిద్య ప్రభ వెనుకకు తగ్గినది.

  అయితే నాలుగణాల డబ్బులు చెల్లించుమని కోరడం కాంగ్రెస్సు విధానము తప్పా అని కొందరు అడుగవచ్చును నిజంగా చూస్తే సంవత్సరానికి ఒక నాలుగణాలు డబ్బులు చెల్లించడం ఒక కష్ట కార్యం కాదు. ఊరికే కాంగ్రెసు సభ్యుడనిపించుకొనుట కంటే, ఒక పావలా డబ్బు లాయెను చెల్లింది అట్లు అనిపించుకొనిటలోఒక విశిష్ట చైతన్యము కూడా ఉంది. చెల్లించినవారు కొంచెం మంది కావడం, చెల్లించని వారు పెక్కుమందియై కాంగ్రెసు సభ్యులు కారనిపించుకోవడం తప్పనిసరియైనది.
  నేటికిని కాంగ్రెస్సుకు తొంటి మహాగౌరవమింకా ఉన్నదంటే, పావలా డబ్బులు చెల్లించని వారు కూడా తాము కాంగ్రెస్సు సభ్యులమే అనుకొని తదా దేసములను ఆచరించి సానుభూతి చూఉతుండుటవల్ల మాత్రమే కలిగినది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొనిన మూకలలో, 1942 విప్లవములో పాల్గొనిన జనసామాన్యములో పావలాడబ్బులు చెల్లించిన వారికి కీర్తి దక్కినది. తక్కినవారు విస్మృతులైనారు. వారేదో ఉత్సాహములో పనిచేసిన వారే కని కీర్తి కాశించి చేయలేదు. పావలాచెల్లించకపోయినా, చెల్లించిన వారికంటే కూడ తత్వత: వారెక్కువ యోగ్యులైన కాంగ్రెసు వారని మనము నుండవవలెను.
గరిమెళ్ళ వ్యాసాలు