పుట:Garimellavyasalu019809mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసనసభలు ప్రభుత్వమువారి నిర్మాణసంస్థలుకాని ప్రజల సౌకర్యములను నిర్మించు సంస్థలు కావనియు, వాటికిని కలెక్టరు కచేరీలు భేరము లేదనియు, కలక్టరుకచేరీలో ప్రయోగించవలసిన చట్టములనే అక్కడ నిర్మించుచుందురనియు, వాటిలోనికి యెవరు వస్తే వరి చేటనే ప్రభుత్వముగారా చర్యలను చేయించుకొనుచుందు రనియు, శాసనసభికత్వము జీతములేని సేవకా వృత్తియనియు, ప్రాత చట్టముల పరిణామములన్ చదివి గుర్రుపట్టుకొని జ్ఞాఫకముంచుకొని క్రొత్తప్రిస్థితులకు సరిపెట్టుకొని ప్రభుత్వము వారిచే శాంక్షను చేయించుకొనగల రీతిని వారికి నచ్చ జెప్పు కొని వారు తిరస్కరించినచో తొందరపడి తిరిగు రాజాలని సహనశక్తి కలవాటు పడిన గుమాస్తా పని చేయగల యోధులకె కాని యితరులకందులొ లాభము లేదనియుస్వచ్చమగు ప్రజాహిత జీవనముకొరకై మత్రమే వాటిలోనికివెళ్ళి అచ్చటవారు పెట్టిన ప్ర్రశస్త్రములగు బిల్లులొకటియును ప్యాసుకామిచే విఫలమనోరధులై వాటిని శపించి బెదరించి యుండిన గోఖలే, వెంకటపతిరాజు, ఈ రామచంద్రరవు మొదలకు వారల ప్తాత చ్రిత్రములే విశదము చేయుచున్నవి. మహాత్మునికార్యక్రమమాసంగతిని స్థిరపరిచి ప్రజలకు నచ్చజెప్పి వాటిపైని విముఖత్వమును గల్పించినది. వాటిలోనికి అధిక సంఖ్యాకులుగా దూరి ముట్టడించి వాటిని నులిబెట్టి తత్వము మార్చి తమ కార్యములను నెగ్గించు కొందమను స్వరాజ్యవాదుల ఆశయములును అనేక కరణముల చేత సఫలీకృతములు కాజాలకున్నవి. వాటిని మార్చుటకు గా నేగి తామే మారవలసిన స్థితి తటస్థించుచున్నది.

     ఇంతలో స్వరాజ్య పక్షమే పాయలును, చీలిక్లునై అట్లు తామును మాఱిపోయి తొంటి నౌకరీ వృత్తి చేయుచు చేతనయినంత మట్టుకు గీకుకొనుటయే శాస్త్రోక్త కర్మమని వాదించు శిష్టులొక ప్రక్కను మన బుగువుసడలించ కూడదనియు మనము కొంతకాలమాకలిని నిగ్రహించుకొన్నచో యీయెమికలే కొంచము కండకట్టి మాంసమెక్కి వంటినిండా వచ్చునని ఆశాస్వప్నములను గను చున్న దీర్ఘదర్శులొక ప్రక్కను ఈ యెన్నిక లనేడి వంతెనయంచున నిలబడి పోరాడుచున్నారు. కాంగ్రెసు ప్రతిఘటన వాదులను తల్లివలె కౌగిలించుకొని కాపాడుచున్నది. కాని తల్లీపిల్లల నందరినీ తన్నియేటిలోనికి త్రోసివేయగల యావేశమునందును సాహసము నందును జ్ఞాన శీల సంపత్తుల యందును, మహిమాదీక్షల యందును, మాతృభాష జపము నందును, దేశాభి