మానము నందును, ప్రభుత్వ సేవయందును, రెండవ పక్షము కొఱవడి యుండలేదని అభినవ కాంగ్రెసు పక్ష చరిత్రములను పఠించు వారల కెట్టి యనుమానమును లేదు. ఇట్టి మహా యజ్ఞములో (యథోచిత) సహకార పక్షమువారికి స్వతంత్రులు మితవాదులు మొదలగు నెల్ల పక్షముల వారును తమ ఆశీర్వాదములనే కాక సహాయబలమును గూడా నిచ్చుచున్నారు. స్వరాజ్యపక్షము కూడను మార్పునకు ప్రతికూలముగా లేదు. భారము నెల్లయు తల్లి కాంగ్రెస్సు మీదనె పెట్టి యున్నది.
ఈ మారు తల్లి పెద్ద కొడుకు పక్షమున నిలచునో, ముద్దు కొడుకుల వొడిలో పెట్టుకొనునో చెప్పజాలము. ఆదర్శజ్ఞానము వాత్సల్య రసము నేనాటికిని జయింపజాలదు. లాలాజీని, మాలవ్యాను, జయకారును మొదలగు వారినెల్ల ఆలింగనము చేసుకొనుటకై, (కంట తడి పెట్టుకొనుచునే ఆయెను) ఈ పెద్దకొడుకును విడిచిపెట్టక ఆమెకు తీరదు. ఆదర్శజ్ఞానమే వాత్సల్యరసమును జయించినప్పుడు గాని, లేక పెద్ద కొడుకు నిజముగా బలవంతుడై తల్లిని తన చిన్నారి పుత్రుల దగ్గరకు (వివేకులే కావచ్చును. అవివేకులే కావచ్చును) వెళ్లనీయకుండా గదిలో పెట్టి తాళము వేయగల సమర్థుడైనప్పుడు కాని, గృహములో మాత్రము శాంతియుండదనియు, వ్యవహారమును గార్డియను గారు తన కిష్టము వచ్చినట్లు తన దగ్గరకు వచ్చిన ఉద్యోగస్థుల చేత చేయించు కొనుననియు చెప్పుట కాటంకము లేదు.
తల్లి తమ పక్షము రాకున్నచో చిన్న కొడుకులు గార్డియను పక్షము చేరి వ్యవహారములు చేసుకొనుచు పెద్దన్నయ్యను తల్లిని ఆదర్శముల పాలు చేయుదురు. పెద్దన్నయ్య కేవలము ఆదర్శజీవియేగాక రాజనీతి పరుడు. వివేకవంతుడు, కాలలక్షణములు తెలిసి మెలగగలవాడు. ప్రతిఘటించుటకే యనుకొనుడు శాసనసభలకై వ్యామోహమును కండూతియు గల వాడును నగుటచేత, తల్లిని తోడుకొనిపోయి తమ్ముని పక్షములో చేరి తల్లి యాజ్ఞాయను పేరిట సముచిత సహకర పక్షములోనికి దిగక తప్పదు. లేదా శాసన సభలను మానుకొని గాంధి ప్రక్కలో దూరిపోవలెను. మొదటిది మానలేడు. రెండవది చేయలేడు. ఇంతలో కాంగ్రెస్సే అతని సహాయమునకు వచ్చి అతని చర్యను దేశసమ్మతమేయని చెప్పి ఆశీర్వదించినచో తృప్తచిత్తుఁడై వారితో కలసి పనిచేయును. అట్లని తన ఆశయములలో తనకు విశ్వాసమున్నన్నాళ్లు, తన తల్లి ఆశీర్వచనము తన
గరిమెళ్ళ వ్యాసాలు
89