పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయ


ఘోరశిక్షలు వర్ణనాతీతములు. ఎలిజబెత్తు రాణి ఐర్లండులోని విశాలవంతమగు ప్రదేశములను అందలి ప్రజలను వెడలగొట్టి స్వాధీనమును పొంది ఇంగ్లీషు ప్రముఖులకు కాపురముండుట కిచ్చెను. ఈమె 1.608 వ సంవత్సరమున చనిపోయెను.


తరువాత రాజ్యమునకు వచ్చిన జేమ్సు, చార్లెసు రాజుల కాలములో తీవ్రమగు సంస్కరణములు కోరిన ఫ్యూరి టను శాఖ ఇంగ్లాండు దేశమునందు విశేషముగ వ్యాపించెను. కాని రాజులా మత శాఖ నణచివేయ యత్నించినందున కొంతమంది దేశమునువిడిచి పారిపోయిరి. కొంత కాలమునకు ప్రజలు చార్లెసు రాజు పై తిరుగుబాటు చేసి యాయనను శిర చ్ఛేదము గావించిరి. తరువాత స్థాపింపబడిన ఫ్యూరిటసు ప్రజాస్వామ్యము వారు రోమును కాథలిక్కులను హింసించిరి. కొంతకాలమునకు తిరిగి రెండప చార్లెసు రాజై 'ప్యూరిటను మతగురువుల నందఱను తీసివేసి రోమను కాథలిక్కులకు స్వేచ్ఛ నియ్య యత్నించెను. కాని పార్లమెంటు వారు రోమను కాథలిక్కు గురువులు దేశమును వదలిపోవ లెసని శాసించిరి. చర్చి ఆఫ్ ఇంగ్లాండు శాఖ యొక్క ఆరాధనకు భిన్నమగు ఆరాధ నను ఐదుగురికన్న నెక్కువమంది సలిపినచో వారిని ఖైదులో చేసెదమనికూడ శాసించిరి. అనేక మంది ప్రొటస్టెంట్లు మనస్సాక్షి కొఱకు కారాగృహములకు జనిరి. కొందరు చెర సాలలలో మరణించిరి. ఎల్లిను అసు సుప్రసిద్ధ గంధకర్త టాంటన్ జైలులో పడిన బాధలవలన మరణించెను. జాక్ బనియను అను గొప్ప గ్రంథకర్త పండ్రెండు సంవత్సరములు చెరసాలలో