పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87

ఏడవ అధ్యాయము

నుండెను. ఆయన వెళ్ళిన జై లు ఇట్టి మతబోధలు చేసిన వాటితో నిండెను. ఆయన భార్యయు పిల్లలు విశేషమగు దరిద్ర బాధకు లో నైరి. ఆంగ్లేయ భాషలో మిగుల సుప్రసిద్ధ గ్రంథ రాజమగు “పిలిగ్రిమ్సు ప్రోగ్రెస్సు"ను ఆయన చెరసాలలోనే వ్రాసెను. 1672 వ సంవత్సరమున "రెండవ చార్లెసు రాజు చెరసాలలలో 'సున్న వారి సందరసు విడుదల చేసి కొంత మతస్వేచ్ఛ కలుగ చేసెను. "కాని ఆంగ్లేయు పార్లమెంటువారు సర్కారుద్యోగము లలోనుండు ప్రతివారును సర్వక ళాశాలలో పట్టపరీక్షకు వెళ్లు వారును చర్చి ఆఫ్ ఇంగ్లాంకు శాఖకు చెందినట్లు ప్రమాణము చేయవలెనని శాసించిరి. ఇందువలన చాలమంది యుద్యోగ ములను పోగొట్టు కొనిరి. రోమను కాధలిక్కులు ఆంగ్లేయు పార్లమెంటులో సభ్యులుగా నుండ గూడదనియు, బహిరంగ ముగా ఆరాధనను జరుపగూడ దనియు చట్టములు చేయబడెను. 1678 వ సంవత్సరమున కుట్రలు చేయుచున్నటుల నేర మారో పింపబడి ఇంగ్లాండులోని రోమను కాథలిక్కులందరును అరెస్టు చేయబడిరి. వారిలో చాల మందిని విచారించి మరణశిక్ష విధించిరి. రెండవ జేస్సు రాజు రోమను కాథలిక్కుల ఉద్యో గములిచ్చి వారిని బహిరంగముగా ఆరాధనను జరుపుకొననిచ్చి సందున పార్ల మెంటువారు ఆయనమీద తిరుగుబాటు చేసి దేశ భ్రష్టునిగావించి హాలెండు దేశమునుండి విల్లియము అను ప్రొటెస్టెంటు మతస్థుని రాజుగా తెచ్చుకొనిరి. "ఐర్లాండు దేశపు కాపురస్థులలో నూటికి ఎనుబదిమంది రోమను కాథలిక్కు లైనను, ఐర్లాండు దేశము ఆంగ్లేయుల క్రిందికి వచ్చినది మొదలు