పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69

ఆఱవ అధ్యాయము

లాభముకొరకును, సముద్రములమీద ప్రయాణము చేయుట కు తోవల కొరకును, అమెరికా, ఆఫ్రికాఖండముల ఆక్రమణ కొరకును వివిధ యూరవుజాతుల వారికిని పోటీలుగలిగి అనేక యుద్ధములు జరిగినవి. ఈ యుద్ధములలో నోడిపోయినవారి కీనూతనఖండములను కని పెట్టుట వలన కలిగే లాభములలో లెక్కువగా లభించెను. గెలిచిన వారి కెక్కు వగ లభించెను. వీటి మధ్య సైనిక బలముతప్ప ధర్మనిర్ణయము చేయుటకు వేరు ఉపొ యము లేదయ్యేను. ఆమెరికా ఆప్రికా ఖండములు పూర్తిగా యూరి పియసు జూతులచే నాక్రమింపబడినవి. ఆఫ్రికాలో నుత్తరమున నాగరికతను చెందిన ముసల్మాసుప్రజలు గలరు. వీరుగూడ స్వతంత్రమును కోల్పోయి యూరపియను జాతులచే పాలించబముచున్నారు. ఇదిగాక మిగిలిన యావత్తు ఆఫ్రికాఖండ ములోను, యావత్తు అమెరికా ఖండములోను యూరపియను ‘జాతులు వలసవచ్చి కాపురముండిరి. ఆప్రదేశములలో నది వరకు నివసించుచుండిన నల్లజాతులు చాలవరకు యూరపియ సులచే నాశనము చేయబడిరి. చావగ మిగిలిన కొద్దిమందిని యూరపియనులు తమకింద బానిసలుగ చేసికొనిరి. పందొ మ్మిదవ శతాబ్దమున బానిసత్వము రద్దుపరచబడెను. అటుత రువాత నీ నల్లవారు యూరపియనుల వ్యవసాయక భూముల లోను, తేయాకు, కాఫీ, రబ్బరు, చెఱకుతోటలలోను, గనుల లోను పనిచేయు కూలీలుగ సున్నారు. ప్రపంచము యొక్క వర్తక మంతయు క్రమముగా యూరపియనులవశ మయినది. యూరపుఖండములో తయారగు సరకులు ప్రపుచములోని దుకా