పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
68

ప్రెంచిస్వౌతంత్ర్యవిజయము

గెను. ప్రధాన క్రై స్తవ మతాచార్యుడగు పోపు ఒక కాగితము మీద గీతగీచి అమెరికాలోని కేపు వర్డీ లంక లకు పశ్చిమమంత. యు 'స్పెయిస్" వానికి, తూర్పుగనున్న ప్రపంచమం తయు పోర్చు. గలు వారికిని పఁంచి యిచ్చెసు. అమెరికా ఆఫ్రికాఖండములు కనుగొనబడినవి. ఆసియా ఖండముతో సులభముగ వర్తకము. చేయుటకు త్రోవలు కనుగొనబడినవి. ఆసియాలోని స్వదేశ రాజుల నాశ్రయించి కొన్ని సముద్ర రేవులలో గిడ్డంగులు కట్టుకొని వ్యాపారము సాగించు చుండిరి. ఆసియాఖండముతో వర్తకముపలన చాలలాభము వచ్చుచుండెను. అమెరికా శీతోష్ణస్థితి యూరపియనులకు మిగుల అనుకూలముగ నుండెను. అమెరికాలోని భూములు, గనులు, అడవులు వీరి వశ మయ్యెను.. అక్కడ అడ్డు లేక వీరు దేశము నాక్రమించుచుండిరి. అనే కులు వలస వెళ్ళి సౌఖ్యముగా నివసించుచుండి. బంగారము తోడను, మేలయిన సరకులతోడను నిండిన పడవలతో తమ. దేశములకు వచ్చుచుండిరి. ఆఫ్రికాఖండములోని నల్లజాతుల. వారిని పట్టుకొని బానిసలుగా విక్రయించుచు, బానిసవ్యాపా' రమువలన చాల దవ్యమును సంపాదించు చుండిరి. ఇటుల స్పె యిను వారుసు పోర్చుగీసువారును ముందు ప్రారంభించగ వారి యైశ్వర్యాభివృద్ధిని చూచి యేబదిసంవత్సరములలోపలనే, డచ్చివారును, పరాసువారును, ఆంగ్లేయులును, నింక నితర యూరపియన జాతుల వారందరును బయలు దేరి వారి మార్గ ములనే యనలంబించిరి. పోపు గీచిన కాగితపు పంపిణీని గౌరవిం చినవా రెవరును లేరు. ఆసియాఖ:డముతో జరుగు వర్తక