ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
ణములను నింపి వేయుచున్నవి. ఆసియా ఖండములోని బౌద్ధ దేశ ములు స్వతంత్రమును గోల్పోవక నిలిచి యున్నవి. ముసల్మా సుదేశములు చాలకాలము స్వతంత్రముగ వున్న విగాని 1919 వ సంవత్సరములో జరిగిన సంధివలన ముసల్మాను. దేశములలో కొన్ని యూరపియసుల యాజమాన్యము కిందికి వచ్చి. స్వాతంత్ర్యము కొఱకై పోరాడు చున్నవి. ఆసియాలోని మధ్య దేశమగు హిందూ దేశ ము మాత్రము మొగలాయిరాజ్య మస్తమించగనే కలిగిన అరాజకమువలన యూరపియనుల పాలనము క్రిందికి వచ్చినది. కొలదినంవత్సర ములనుండియు మేల్కొని స్వరాజ్యమునకై కృషి సలుపుచున్న ది. ఆఫ్రికా దేశ ములోని ఈజిప్టు దేశము కూడ తెల్లవారి ప్రభుత్వమునుండి స్వాతంత్ర్యమును బొందుటకు ప్రయత్నించి కొంతవరకు జయమును బొందినది.