ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఏడవ అధ్యాయము
ప్రొటెస్టెంటు మతస్థాపనము
(1)
రాజు యొక్క అధికారము,
"ఫ్రాన్సు దేశ వు రాజగు పదునొకండవ లూయిరాజు క్రింద పట్టణములు వృద్ధియయ్యెను. పరిశ్రమలు హెచ్చి ధనము అధిక మయ్యెను. అచ్చువే వేయుటను రాజు ప్రో త్సహించెను. విద్య వ్యాపించెను. తెలివిగలి గినట్టి యు, స్వతంత జీవనములు కలిగి నట్టియు మధ్యమతరగతి ప్రజా సంఘము వృద్ధి చెందెసు. వీరు ప్రభువుల యధికారమునందు వి. ముఖులై రాజు యొక్క అధికారవృద్ధికి తోడ్పడిరి. రాష్ట్రము . లన్నిటిలోను రాజు యొక్క అధి కారము క్రింద న్యాయస్థానములు స్థాపించబడెను. ప్రజలందరును వీనిలో తమ కష్టములను చెప్పు కొనవచ్చునను ఆచారము ఏర్పడెను.