పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
58

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

నీచమైన మంటలలో మరణించు శిక్ష తనకియ్య బడినదని ఆదిక్కు లేని పందొమ్మిది వత్సరముల యీడుగల ఆడబిడ్డ వెక్కి వెక్కి యేడ్చెను. తనకు శిరచ్ఛేదము చేసిన చాల మేలని రోదనము చేసెను, ఆమెకు దిక్కెవ్వరు? ఆమెను బండిలో వేసికొని 800 మంది ఆంగ్లేయ సైనికులు ఆయుధపాణులై ఇరు పక్క- లను నడువగ చేపల బజారునకు తీసికొనిపోయిరి. అచట నెత్తుగా పేరుప బడియున్న కట్టెలపై యామెను బడ వేసి బంధించి నిప్పం టించిరి. ఆమె దైవమును ఏసుక్రీస్తు ప్రభువును ప్రార్థించుచు తన శత్రువులను క్షమించుచు మంటలో కాలి ఘోరమరణ మును పొందెను.

4

ఇంగ్లీషు వారి
అపజయములు

ఆమెను చంపిన తర్వాత ఆంగ్లేయు అపజయముల వెంట సపజయముల నొందిరి. పరాసువారిలో ప్రతి చోటను విదే శీయులగు నాంగ్లేయులనుండి తమ దేశమును సంరక్షించవ లెనను 'దేశాభిమాసము పుట్టెను. జోన్ ఆఫ్ ఆర్కును పరాసుప్రజలు దేశము కొరకై ఘోర మరణము నొందిన మహాత్మురాలిగ జ్ఞాపకముంచుకొనిరి. బగ్గండీప్రభువు ఆంగ్లేయ రాజునుండి చీలివచ్చి పరాసు రాజుతో సంధి చేసికొనెను. ఆంగ్లేయుల బలము క్షీణించెను. 1436 వ సంవత్సరమున ఏడప చార్లెసు (పరాసురాజు) పారిసుపట్టణము నాక్రమించెను. 1439 వ సంవత్సరమున నార్మండీ రాష్ట్రము ఆంగ్లేయుల పై తిరుగబడగ పరాసురాజు తిరుగుబాటును ప్రో త్సహించెను. క్రమముగా పరాసు దేశములోని ఉత్తర భాగము నంతను పరాసువారు స్వాధీనము చేసికొనిరి. గ్వయ నీ రాష్ట్రము