పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

అయిదప అధ్యాయము

కూడ పరాసురాజుకు వశమయ్యెను. తుదకు 1453 సంవత్సర మున కాస్టిలానునొద్ద జరిగిన యుద్ధములో నూరు సంవత్సర ముల యుద్ధము ముగిసినది.ఈ యుద్ధములో పరాసు రాజు సంపూర్ణముగా జయమొందెను. కెలే అను "రేవుపట్టణ ముతప్ప మిగిలిన యావత్తు ఫ్రాన్సు దేశమునుండియు ఆంగ్లేయులు పెళ్లగొ ట్టబడిరి. ఫ్రాన్సు దేశ మంతయు పరాసురాజగు ఏడవచార్లెసు రాజు కిందికి వచ్చెను. ఈ నూరుసంవత్సరముల యుద్ధము అంతరించుసరికి పరాను దేశములో రాజు బలవంతుడయ్యెను. దేశమున కంతయు ఆయన ముఖ్యుడయ్యెసు. దేశములోని వర్తకులును ప్రజలును రాజుపక్షమున చేరిరి. ప్రజల యొక్క యిండ్ల మీదను భూముల మీదను టాలీయను పన్ను వేసి రాజు స్వంత పటాలములను సమకూర్చుకొనెను. ఈ యుద్ధములలో ఆ నేకులను ప్రభువులు చనిపోయి కొన్ని ప్రభువంశము లంతరిం చెను. ప్రభువుల బలము తగ్గెను.