పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

ఆఱవ అధ్యాయము

యూరపియనులు హిందూదేశమునకు వచ్చుట

(1)

తురుష్కులులు
కౌన్ స్టాంటి
నోపిలును
వశపరచు
కొనుట,

పదుమూడవ శతాబ్దమున ముసల్మానులలో ఆటోమా ను తురుష్కులు ప్రాముఖ్యమును వహించిరి. వారి నాయకులు 1398 సంవత్సరమున సర్బియాను జయించి , యూరపుఖండములో స్థావర మేర్పజచు కొనిరి. 1453 సంవత్సరమున ముసల్మాను సుల్తానగు" రెండవ మహమ్మదు కాన్ స్టాంటినోపిలు పై దండె త్తెను. "కాన్ స్టాంటి నోపిలు 4 వ క్రైస్తవ మత యుద్ధమునాటి : నుండియు బలహీనముగ నుండుట చూచియున్నాము. అపుడు.