పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

అయిదవ అధ్యాయము

రేకమని నేరారోపణ చేసి. ఆమె నిర్దోషినని చూపుటకు అవ కాశమియ్య లేదు. పోపుకు అప్పీలు చేసికొనుటకు అవకాశమియ్య లేదు. ఆమె పురుష వేషము ధరించినది, ఆమె "సైనికులనుండి మానమును గాపాడ కొనుటకై యుండెను. తక్కిన సంగతుల కన్ని టికిని ఆమె సమాధానము చెప్పెను. న్యాయాధిపతు లామె ను ఎటులైనను శిక్షించుట కొరకయియే నామకః విచారణను జరిపిరి. ఆమెను కై స్తవ మఠములో వదలి పెట్టెదమని వాగ్దత్త ముచేసి, ఇంతటి నుండియు పురుష వేషము వేయననియు, తాను యుద్ధములో ప్రవేశించి ననియు వ్రాయించు కొని, యావజ్జీవ మామె ఖయిదులో నుండునట్లు న్యాయాధిపతులు శిక్ష విధించిరి. ఆంగ్లేయుల ఖయిదులో ఆమె యుండెను. ఆంగ్లే యులు యుద్ధములలో ఓడి పోవుచుండిరి. ఆమె బ్రతికి యుండుట ఆంగ్లేయుల కిష్టము లేదు. ఆంగ్లేయు సైనికు లామెకు 'చెర సాలలో పురుష వస్త్రముల నిచ్చి బలవంతముగ స్త్రీవస్త్రములను లాగికొనిరి. ఆమె యెంత చెప్పినను వినలేదు. నిస్సహాయురా లగు ఆయబల పురుష వేషము వేయక తప్పినదిగాదు, ఏబట్టలు లేకుండ నాయువతి ఎటులుం డగలదు? విధి లేక పురుషవస్త్రముల దరించినది. పురుష వస్త్రములు తిరిగి ధరించినదని 'ఆ మె మీద నాంగ్లేయులు నేరారోపణ చేసిరి. యథార్థము న్యాయాధిపతుల కు తెలియును గాని శిక్షించకుండ న్యాయాధిపతు లెటులు విడిచి పెట్టగలరు? తిరిగి మతద్రోహి అయినది గావున ఆమెను మంటల లో వేసి తగులబెట్ట వలసినదను శిక్ష విధించిరి. ఈఘోరశిక్ష విన గా నే తనవలన సెట్టిలోపము లేనిదే ఇట్టి మతద్రోహి యొక్క