పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

కిరీటధారణము గావించెను. జోను తనకు భగవంతునిచే నియమింపబడిన కార్యమును ముగించెను, తన స్వగ్రామము. నకు పోయి తన తండ్రి యొక్క మేకల మందలను కాచుకొనెద నని చెప్పెను. కానీ ఇంకను పరాసు దేశములో చాలభాగము ఆంగ్లేయుల క్రింద నున్నది గావున ఇంకను కొంతకాల మాగవల యునని రాజు గోరెను. ఈమె తక్షణమే పారిసు మీదికి వెడలు మని చెప్పెను. కాని రాజు యొక - సలహాదారు లట్టిపని చేయు టకు ధైర్యము చాలక పారిసు చుట్టుపట్ల నున్న చిన్న ప్రదేశ' ములను ముందుగా జయించ నిశ్చయించిరి. ఈ ప్రాంతము లన్నియు పరాసు వారికి లోబడెను. పారిసును వీరు చేరుసరికి: శత్రువులు పారిసులో బాగుగా స్థావర మేర్పఱచు కొని పారిసు ప్రజలను తమ వైపుకు తిప్పుకొనిరి. పరాసు సైన్యములు పారి సును ముట్టడిసల్పెసు గాని నిష్ప్రయోజక మయ్యెను. బర్గండీ. ప్రభువు కాం పైన్ ను ముట్టడించెను. దీనిని జోను సంరక్షింప యత్నించెను. 1430 వ సంవత్సరము మే నెల 30 వ తేదీన ఆమె దీని దర్వాజా బయటకు వచ్చి యుద్ధము చేయుచుం డెను. ఇంతలో దర్వాజా లోపలనుండి మూయబడెను. ఆమె శత్రువుల మధ్య చిక్కెను. బర్గండీవా రామెను పట్టుకొనిపోయి పది వేల ఫ్రాన్కులకు ఇంగ్లీషువారి కమ్మి వేసిరి. ఇంగ్లీషువా రామేను ఖైదులో వేసి తమకు లోబడిన ముగ్గురు పరాసు మత గురువుల చేత విచారణ చేయించిరి. పురుషుల బట్టలు ధరించుట యు, తల్లిదండ్రుల అనుమతి లేక యుద్ధమునకు వెడలుటయు, మహాత్ముల దర్శనమయినదని చెప్పుటయు, మతమునకు వ్యతి