పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
55

అయిదవ అధ్యాయము


దనుగ్రహమువలన జయించి తీరెదమను దృఢవిశ్వాసము గలిగి యుండిరి. ఆమె పేరు విని దయ్యాల పోతనియు సైతాను యొక్క బలముచే తమ్మును. నాశనము చేయుటకే వచ్చి నిదనియు ఆంగ్లే య సైనికులు మిగుల భీతిఁ జెందిరి. పరాసు సేనలు ఆమెయొక్క ప్రోత్సాహమువలన బహుసాహసముతో పోరాడి ఆంగ్ల సేనల నోడించి ఆర్లీయస్సులో ప్రవేశించిరి. లోపలనున్న ప్రజలు కూడ బయటికి వచ్చి ఆంగ్లేయులను ముట్టడించిరి. మే నెల 8 వ తేదిన వారి సేనాధిపతులునుచే చాలవరకు సైన్యములును హతులు కాగ ఆంగ్లేయులును, బర్గండీ యులును మందుగుండు సామగ్రిని వదలి పారిపోయిరి. సేనలును ప్రజలును వారి వెంటనంటి చంపదలచి రిగాని, "వారిని పోనిండు; వారి వెంటబడి చంప వలదు.ఈది సము సబ్బాతుదినము," అని జోను చెప్పినందున మానివైచిరి. మే 18 వ తేదిన ఆమె తిరిగి రాజును దర్శించి రైమ్సునకువచ్చి కిరీట ధారణము గావింపుమని కోరెను. రైమ్సుకు రాజు బయ లు వెడలెను. త్రోవలో పేటేయివద్ద ఇంగ్లీషు సైన్యముల నోడిం చెను. ఇంగ్లీషు సైనికులలో చాలమంది హతులైరి. వారి సేనానులు పరాసు వారిచే ఖయిదుచేయబడిరి. ఆ ప్రాంతము లన్నియు పరాసురాజు స్వాధీన మయ్యెను. ట్రాయిసు, షాలా న్సు పట్టణములు పరాసు రాజు వశమయ్యెను. ప్రతిచోటను ప్రజలాయనను ఆదరించిరి. తుదకు జులై 18 వ తేదిన జయ ప్రదముగా రాజు . రైమ్సును చేరెను. అది బర్గండి రాష్ట్రములో నిది, అచటి ప్రజలుకూడ పరాసురాజుకు లొంగిరి, జూలై 17 వ తేదిన పరాసురాజగు - ఏడవచార్లెసు పట్టాభిషిక్తుడై


--